న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్వీప్ షాట్ ఆడటం ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నా: డివిలియర్స్

తక్కువ ఎత్తులో వచ్చే బంతిని స్వీప్ షాట్ ద్వారా బౌండరీకి తరలించేందుకు వంద శాతం ప్రయత్నిస్తానని దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఏబీ డివిలియర్స్ చెప్పాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: తక్కువ ఎత్తులో వచ్చే బంతిని స్వీప్ షాట్ ద్వారా బౌండరీకి తరలించేందుకు వంద శాతం ప్రయత్నిస్తానని దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఏబీ డివిలియర్స్ చెప్పాడు. ఓ క్రికెట్ వెబ్ సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో డివిలియర్స్ స్వీప్ షాట్‌పై మాట్లాడాడు.

స్వీప్ షాట్‌ని తాను పాకిస్థాన్ క్రికెటర్ యూనిష్ ఖాన్ నుంచి నేర్చుకున్నట్లు డివిలియన్స్ చెప్పాడు. 'బంతి నెమ్మదిగా తక్కువ ఎత్తులో వస్తే.. నా బ్యాట్ కింద నుంచి అది కీపర్ చేతుల్లోకి వెళ్లేందుకు నేను ససేమేరా ఇష్టపడను. అలాంటి బంతిని స్వీప్ షాట్ ద్వారా బౌండరీకి తరలించేందుకు వంద శాతం ప్రయత్నిస్తా' అని డివిలియర్స్ తెలిపాడు.

 Younis Khan: AB de Villiers might have picked up some technical aspect of my sweep

నిజానికి స్పిన్ బౌలింగ్‌లో స్వీట్ షాట్ ఆడటంలో పాకిస్థాన్‌కు చెందిన యూనిస్ ఖాన్ సిద్ధహస్తుడు. అంతేకాదు యూనిస్ ఖాన్‌ని స్వీప్ షాట్ మాస్టర్ అని కూడా క్రికెట్ అభిమానులు ముద్దుగా పిలుస్తుంటారు. తాజాగా డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలపై యూనిస్ ఖాన్ స్పందించాడు.

నిజానికి స్వీప్ షాట్‌ ఇలా ఆడాలని డివిలియర్స్‌కు తాను చెప్పలేదని యూనిస్ ఖాన్ అన్నాడు. క్రికెట్‌లో ప్రొపెషనల్ ఆటగాళ్లు ఒకరి ఆటను మరొకరు నిశితంగా పరిశీలిస్తుంటారని వెల్లడించాడు. 'స్వీప్ షాట్‌ ఆడటంలో మెలకువలు అంటూ ఏమీ ఉండవు. కానీ.. ఆ షాట్ ఆడాలంటే ధైర్యం కావాలి. ఒకవేళ ఆ షాట్ ఆడే ప్రయత్నంలో నువ్వు అవుటైతే.. అందరూ వేలెత్తి చూపిస్తారు' అని అన్నాడు.

'నా కెరీర్‌లోని చివరి మ్యాచ్‌లో ఫుల్ టాస్ బంతిని స్వీప్ షాట్ కొడుతూ నేను వికెట్ సమర్పించుకున్నాను. నా కెరీర్‌లో 10వేల పరుగుల మైలురాయిని స్వీప్ షాట్‌తోనే పూర్తి చేసిన నేను.. కెరీర్‌లో సాధించిన ఏకైక ట్రిఫుల్ సెంచరీని రివర్స్ స్వీప్‌తో పూర్తి చేయడం నాకు ఇంకా గుర్తుంది. నేను కూడా కొన్ని షాట్లు డివిలియర్స్ బ్యాటింగ్ చూసి నేర్చుకున్నా' అని యూనిష్ ఖాన్ పేర్కొన్నాడు.

కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ స్వీప్ షాట్ ఆడటం చాలా సులువని.. ఆదే ఎడమచేతి వాటం స్పిన్నర్ లేదా లెగ్ స్పిన్నర్ బౌలింగ్‌లో అయితే స్వేచ్ఛగా ఆడొచ్చని యూనిస్ ఖాన్ తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X