న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సైనీ, శార్దూల్ ఇంటర్యూ: 'యార్కర్ క్వీన్' అంటూ నవ్వులు పూయించిన చాహల్ (వీడియో)

IND VS SL 2020 : Yuzvendra Chahal's Cheeky Dig At Navdeep Saini || Oneindia Telugu
Yorker Queen: Yuzvendra Chahals Cheeky Dig At India Pacer Post Indore T20I

హైదరాబాద్: ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మంగళవారం రాత్రి శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. శ్రీలంక నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోనే ఛేదించింది. ఫలితంగా మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 32 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 45 పరుగులు చేయడంతో పాటు తొలి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి జట్టు విజయంలో కీలకంగా వ్యవహారించాడు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో భారత బౌలర్లు విజయవంతమయ్యారు.

50 బంతుల్లో సెంచరీ సాధించే సత్తా ఉంది: కేఎల్ రాహుల్‌కు గంభీర్ ప్రశంస50 బంతుల్లో సెంచరీ సాధించే సత్తా ఉంది: కేఎల్ రాహుల్‌కు గంభీర్ ప్రశంస

భారత బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ (3), నవదీప్‌ సైని (2), కుల్‌దీప్‌ యాదవ్‌ (2) దెబ్బకు శ్రీలంక బ్యాట్స్‌మెన్ విలవిల్లాడారు. మ్యాచ అనంతరం నవదీప్ సైని, శార్దూల్‌ ఠాకూర్‌లను చైనామన్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్‌ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా వారిద్దరిని కొన్ని విచిత్రమైన ప్రశ్నలు అడిగాడు.

ఒకేరోజు రెండు హ్యాట్రిక్‌లు: బిగ్‌బాష్ లీగ్‌ చరిత్రలోనే మొదటిసారి (వీడియో)ఒకేరోజు రెండు హ్యాట్రిక్‌లు: బిగ్‌బాష్ లీగ్‌ చరిత్రలోనే మొదటిసారి (వీడియో)

"జస్ప్రీత్‌ బుమ్రాను యార్కర్ల రారాజు అంటారు. అంటే నువ్వు యార్కర్ల రాణివా?" అని సైనీని అడగటంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు పూశాయి. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య మూడో టీ20 శుక్రవారం పూణె వేదికగా జరగనుంది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, January 8, 2020, 19:33 [IST]
Other articles published on Jan 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X