న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'రాయుడు నీ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో... నువ్వేంటో చూపించు'

Yograj Singh takes jibe at MS Dhoni, urges Ambati Rayudu to return


హైదరాబాద్: తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా అంబటి రాయుడికి టీమిండియా మాజీ క్రికెటర్‌, యువరాజ్‌ సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్ సూచించాడు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌కు స్టాండ్ బై జాబితాలో పేరు ఉన్నప్పటికీ... గాయపడిన ఆటగాడి స్థానంలో చోటు లభించకపోవడంతో అంబటి రాయుడు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

రాయుడి రిటైర్మెంట్‌పై యోగ్‌‌రాజ్‌ మాట్లాడుతూ

రాయుడి రిటైర్మెంట్‌పై యోగ్‌‌రాజ్‌ మాట్లాడుతూ

తాజాగా ఎన్ఎన్ఐఎస్ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌‌రాజ్‌ మాట్లాడుతూ "రాయుడు కచ్చితంగా జట్టులో ఉండి తీరాలి. తానింకా ఎన్నో మ్యాచులు ఆడాల్సి ఉంది. రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ, దులీప్‌ ట్రోఫీల్లో అతడు నాటౌట్ కాకుండా 100, 200, 300 పరుగులు చేయాలి. అతడిలో ఇంకా చాలా క్రికెట్ దాగుంది" అని అన్నాడు.

క్రికెట్‌ నిన్ను చాలా మిస్‌ అవుతుంది

క్రికెట్‌ నిన్ను చాలా మిస్‌ అవుతుంది

"క్రికెట్‌ నిన్ను చాలా మిస్‌ అవుతుంది. అంబటి రాయుడు చేయాల్సిన పనులు ఇంకా మిగిలే ఉన్నాయి. నా కొడుకు లాంటి రాయుడు విరక్తితో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకున్నాడు. దయచేసి నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో. నిన్ను విస్మరించిన వారికి నువ్వేంటో నిరూపించు" అని యోగ్‌రాజ్ సింగ్ అన్నాడు.

ధోనిపై విమర్శలు

ధోనిపై విమర్శలు

"ధోని లాంటి క్రికెటర్లు ఎప్పటికీ ఉండరని... ఇలాంటి మలినాలు ఎప్పటికీ ఉండవు" అని ధోనిపై కూడా యోగ్‌రాజ్ సింగ్ విమర్శలు చేశాడు. ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో అంబటి రాయుడితో పాటు రిషబ్ పంత్‌ని స్టాండ్‌బై జాబితాలో బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేశారు.

స్టాండ్ బై ఆటగాళ్ల జాబితాలో రాయుడి పేరు

స్టాండ్ బై ఆటగాళ్ల జాబితాలో రాయుడి పేరు

తొలుత ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడి టోర్నీకి దూరమైనప్పుడు ఆ స్థానంలో రిషబ్‌ పంత్‌ను ఇంగ్లాండ్‌కు పిలిపించారు. ఆ తర్వాత విజయ్‌ శంకర్‌కు గాయమై టోర్నీ నుంచి నిష్క్రమించినప్పటికీ అంబటి రాయుడిని చోటు కల్పించకుండా.... అతడి స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. దీంతో మనస్తాపం చెందిన అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Story first published: Wednesday, July 10, 2019, 12:21 [IST]
Other articles published on Jul 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X