న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Suryakumar Yadav: 2022 సూర్య నామ సంవత్సరమే.. మెరిసింది మిస్టర్ 360 ఒక్కడే!

Yearender 2022: Suryakumar Yadav tops the list of most T20I runs

హైదరాబాద్: చూస్తుండ‌గానే 2022వ సంవ‌త్స‌రం కూడా ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ఈ ఏడాది భారత క్రికెట్‌కు చేదు జ్ఞాపకాలే మిగిలాయి. మరోసారి టీ20 ప్రపంచకప్ తృటిలో చేజారింది. ఓవర్‌సీస్ పర్యటనల్లోనూ ఓటములే ఎదురయ్యాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలకు కూడా మిశ్రమ జ్ఞాపకాలే మిగిలాయి. అయితే సూర్యకుమార్ యాదవ్‌కు మాత్రం ఈ ఏడాది అద్భుతంగా కలిసొచ్చింది. ఈ ఏడాది బౌలర్ల పాలిట సింహస్వప్నంలా సూర్య చెలరేగాడు. తనదైన 360 డిగ్రీస్ ఆటతో 2022 సూర్యనామ సంవత్సరంగా మార్చుకున్నాడు.

ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లో పూనకం వచ్చిన వాడిలా ఊగిపోయి ఫోర్లు, సిక్సర్లతో ‍ ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మైదానం నలుమూలలా షాట్లు ఆడి మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ప్లేయర్‌ బిరుదుకు న్యాయం చేశాడు. ఈ ఏడాది టీ20ల్లో స్కై ఆడిన కొన్ని షాట్లు చూసి విశ్లేషకులు నివ్వెరపోయారు. స్కై.. తొలి 360 డిగ్రీస్‌ ప్లేయర్‌ ఏబీ డివిలియర్స్‌కు ఏమాత్రం తీసిపోడని ప్రశంసలతో ముంచెత్తారు.

ఈ ఏడాది మొత్తం 31 టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్‌.. 46.56 సగటున, 187.43 స్ట్రయిక్‌ రేట్‌తో 1164 పరుగులు సాధించాడు. ఇందులో 2 శతకాలు, 9 అర్ధశతకాలు ఉన్నాయి. 32 ఏళ్ల సూర్యకుమార్‌ యాదవ్ ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగుల (1164) వీరుడిగా, అత్యధిక సిక్సర్లు (98) బాదిన ధీరుడిగా కొనసాగుతున్నాడు. ఓవరాల్‌గా 42 టీ20లు ఆడిన సూర్య.. 44 సగటున, 181 స్ట్రయిక్‌ రేట్‌తో 1408 పరుగులు చేశాడు.

Yearender 2022: Suryakumar Yadav tops the list of most T20I runs

ఓవరాల్‌గా సూర్య టీ20 కెరీర్‌లో 2 సెంచరీలు, 12 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఈ గణాంకాలే కాకుం‍డా సూర్య ఈ ఏడాది టీ20ల్లో ఎన్నో రికార్డులు, మరెన్నో రివార్డులు, అంతకుమించిన అవార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. జట్టులోకి వచ్చిన అనతికాలంలోనే (2021లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ) ఆకాశమంత ఎత్తు ఎదిగిన సూర్యకుమార్‌.. టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని అందుకున్నాడు.

వెస్టిండీస్‌తో 7 టీ20ల సిరీస్ నుంచి దూకుడు మొదలు పెట్టిన సూర్యకుమార్ యాదవ్.. టీ20 ప్రపంచకప్ వరకు తన ఫామ్ కొనసాగించాడు. ఆసియా కప్‌లోనూ అదరగొట్టాడు. ప్రతీ సిరీస్‌లో మెరిసిన సూర్య.. భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది భారత క్రికెట్‌కు కలిసి రాకున్నా.. సూర్యకు మాత్రం బాగా కలిసొచ్చింది.

Story first published: Tuesday, December 20, 2022, 21:21 [IST]
Other articles published on Dec 20, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X