WTC Final 2021:సినిమా పేర్లు చెప్పమంటే..తడబడ్డ టీమిండియా ప్లేయర్స్!ఇషాంత్ ఒక్కడే(వీడియో)

సౌథాంప్టన్‌: ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ 2021కు సమయం దగ్గరపడింది. మరో రెండు రోజుల్లో ఈ మెగా పోరుకు తెరలేవనుంది. ఇంగ్లండ్‌లోని సౌథాంప్టన్ వేదికగా జరగనున్న ఈ టైటిల్‌ పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో చాంపియన్‌షిప్ ఫైనల్ జరగడం ఇదే తొలిసారి కావడంతో.. ఈ మెగా పోరుపై అందరిలోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. అభిమానులతో పాటు క్రికెటర్లు కూడా ఫైనల్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సౌథాంప్టన్‌లోని ఏజీయస్‌ మైదానంలో ఇరు జట్లు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడుతూ తుది పోరుకు సిద్ధమవుతున్నాయి.

ర్యాపిడ్‌ ఫైర్‌ కంటెస్ట్‌

ర్యాపిడ్‌ ఫైర్‌ కంటెస్ట్‌

భారత ఆటగాళ్లు ఒకవైపు ప్రాక్టీస్ చేస్తూ.. మరోవైపు జాలిగా గడుపుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం పలువురు క్రికెటర్లు ఓ ర్యాపిడ్‌ ఫైర్‌ కంటెస్ట్‌లో పాల్గొన్నారు. అందుకు సంబందించిన వీడియోను బీసీసీఐ తన ధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ అయింది. ఆ వీడియో అభిమానుల్లో నవ్వులు పూయిస్తోంది. వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె.. సీనియర్‌ పేసర్లు ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీ.. టెస్టు స్పెషలిస్టు చేతేశ్వర్‌ పుజారా, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని మూడు ప్రశ్నలు అడగ్గా.. అందులో ఒకటి బాలీవుడ్‌కు సినిమాలకు సంబంధించినది ఉంది. దానికి సమాధానాలు చెప్పలేక భారత క్రికెటర్లు కాస్త ఇబ్బందులు పడ్డారు. అదేంటో చూద్దాం.

PSL 2021: వైరల్ వీడియో.. పాకిస్తాన్ క్రికెటర్ల మధ్య గొడవ!!

ఇషాంత్ తప్ప

ఇంగ్లండ్‌లో మీకిష్టమైన అల్పాహారం ఏది అని అడగ్గా.. నలుగురు భారత ఆటగాళ్లు ఉడకబెట్టిన గుడ్లు, బేక్డ్‌ బీన్స్‌ అని చెప్పారు. టెస్టు స్పెషలిస్టు చేతేశ్వర్‌ పుజారా మాత్రం తాను వెజిటేరియన్‌ అని చెబుతూ.. బ్రౌన్‌ టోస్ట్‌, ఆలూ టోస్ట్‌, బీన్స్‌ అని సమాధానమిచ్చాడు.

లండన్‌లో తీసిన మూడు బాలీవుడ్‌ సినిమా పేర్లు ఏంటి అని అడగ్గా.. అందరూ కాస్త తడబడ్డారు. నమస్తే లండన్‌, క్వీన్‌, దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే అని ఇషాంత్ చెప్పగా.. నమస్తే లండన్‌, కల్‌హోనహో అంటూ అశ్విన్‌ ఆగిపోయాడు. దిల్‌వాలే అందరికీ తెలిసిందే అని, ఇంకోటి హౌస్‌ఫుల్‌ అని రహానె చెప్పాడు. నమస్తే లండన్‌, దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే అని షమీ పేర్కొన్నాడు. ఇషాంత్ తప్ప మిగతా వారు మూడు బాలీవుడ్‌ సినిమా పేర్లు చెప్పలేకపోయారు.

ఇంగ్లండ్‌లో మీరు చేయాలనుకునే మూడు పనులు?

ఇంగ్లండ్‌లో మీరు చేయాలనుకునే మూడు పనులు?

ఇషాంత్‌: నేనెప్పటికే ఇక్కడికి చాలాసార్లు వచ్చాను. ఇక్క అన్నీ చూశాను. ఇంకా ఏమీ మిగలలేదు.

షమీ : ఇక్కడి వాతావరణాన్ని ఆస్వాదించడం, షాపింగ్‌ చేయడం, బయట తిరగడం.

అశ్విన్‌: లండన్‌ వీధుల్లో ఎక్కడైనా నడుచుకుంటూ వెళ్లొచ్చు. రోడ్ల పక్కన కాఫీ షాపుల్లో సరదాగా ఉంటూ సమయం గడపడమంటే నాకు చాలా ఇష్టం.

రహానె: ఇక్కడ క్రికెట్‌ ఆడటమంటే చాలా ఇష్టం. అది కాకుండా రోడ్లపై నడుచుకుంటూ వెళ్లడం, పార్కులు, కాఫీ షాపుల్లో సరదాగా కుటుంబంతో గడపడం ఇష్టం.

పుజారా: ఇక్కడ కొత్త ప్రదేశాలను చూడాలని, లాంగ్‌ డ్రైవ్స్‌కు వెళ్లాలని ఉంటుంది. అలాగే ఉదయం అల్పాహారం తీసుకున్నాక వివిధ రకాల కాఫీలను ఆస్వాదించాలన్నా ఇష్టమే.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, June 16, 2021, 16:15 [IST]
Other articles published on Jun 16, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X