న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మాంచెస్టర్‌లో సాహాకు సర్జరీ పూర్తి: ట్విట్టర్‌లో బీసీసీఐ ఫోటోలు

By Nageshwara Rao
Wriddhiman Saha undergoes surgery in Manchester under BCCI supervision

లండన్: టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్‌ సాహాకు మాంచెస్టర్‌లో సర్జరీ పూర్తయింది. ఈ మేరకు బీసీసీఐ సాహా సర్జరీ అనంతరం కోలుకుంటున్న ఫోటోలను తన అధికారిక ట్విటర్‌‌లో అభిమానులకు షేర్ చేసింది. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనలో సాహా క్యాచ్ అందుకునే ప్రయత్నంలో అతని భుజానికి దెబ్బ తగిలింది.

ఆ తర్వాత గాయం తీవ్రత ఎక్కువ కావడంతో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి స్వదేశానికి తిరిగొచ్చాడు. ఆ తర్వాత కోలువడంతో ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ మ్యాచ్‌లో ఆడుతున్న సందర్భంగా చేతి వేలికి గాయం కారణంగా లీగ్ దశ నుంచే నిష్క్రమించాడు.

భుజం గాయంతో తిరగబెట్టడంతో ఆపరేషన్

అదే సమయంలో భుజం గాయంతో తిరగబెట్టడంతో సాహా మరింతగా బాధపడ్డాడు. దీంతో వైద్యుల సలహాల మేరకు పరీక్షలు నిర్వహించగా ఆపరేషన్ చేయించుకోవాలని సలహా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు సాహా దూరమయ్యాడు. బీసీసీఐ ఫిజియోల సూచన మేరకు సాహా ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌ డాక్టర్ లెనార్డ్ ఫంక్ ఈ ఆపరేషన్ చేశాడు.

6 నుంచి 8నెలల సమయం

"గాయం నుంచి కోలుకోవడానికి సర్జరీ తప్పనిసరి అతనికి చెప్పాం. చికిత్స కోసం ముంబై, మాంచెస్టర్‌లలో ఒకదాన్ని ఎంచుకోవాలని కోరగా అతడు మాంచెస్టర్‌ను ఎంపిక చేశాడు. మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చి ఆడేందుకు అతనికి కనీసం 6 నుంచి 8నెలల సమయం పట్టవచ్చు" అని బీసీసీఐ అంతకముందు పేర్కొన్న సంగతి తెలిసిందే.

సాహా కోలుకుంటున్నాడు

సాహా కోలుకుంటున్నాడు

ఆపరేషన్ అనంతరం 'బీసీసీఐ మెడికల్‌ టీం పర్యవేక్షణలో సాహా కోలుకుంటున్నాడు' అని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. సాహా కోలుకోవడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే నవంబరులో ఆసీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు సాహా దూరం కానున్నట్లు బీసీసీఐ తెలిపింది.

సాహా స్థానంలో దినేశ్‌ కార్తీక్‌

సాహా స్థానంలో దినేశ్‌ కార్తీక్‌

గాయం కారణంగా ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేసిన టెస్టు జట్టులో కూడా సాహాకు చోటు దక్కలేదు. సాహా స్థానంలో దినేశ్‌ కార్తీక్‌ను బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేశారు. 2004లో ధోనీ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటి నుంచి సాహానే భారత టెస్టు జట్టుకు వికెట్‌ కీపర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Story first published: Thursday, August 2, 2018, 13:58 [IST]
Other articles published on Aug 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X