న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'పంత్‌ను ఆడించాలనుకుంటే నాకు అభ్యంతరం లేదు.. జట్టు విజయం సాధిస్తే చాలు'

Wriddhiman Saha opens up on competition with Rishabh Pant

రాజ్‌కోట్‌: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు తనని కాదని వికెట్‌కీపర్‌ రిషబ్ పంత్‌ను తుది జట్టులోకి తీసుకోవడంపై సీనియర్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా స్పందించాడు. ఒకవేళ టీమిండియా పంత్‌ను ఆడించాలనుకుంటే తనకెలాంటి అభ్యంతరం లేదని, జట్టు విజయం సాధిస్తే చాలన్నాడు. తాజాగా రంజీట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర చేతిలో పశ్చిమ్‌ బెంగాల్‌ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సాహా స్టార్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఓటమికి కారణాలు చెప్పాడు.

ధోనీ వీడ్కోలు వీడియో.. చెన్నై నుంచి రాంచీకి చేరిన మహీ!!ధోనీ వీడ్కోలు వీడియో.. చెన్నై నుంచి రాంచీకి చేరిన మహీ!!

సాకులు చెప్పడం సరికాదు:

సాకులు చెప్పడం సరికాదు:

'న్యూజిలాండ్‌తో నేను టెస్టులు ఆడనప్పుడు ఎర్రబంతితో ప్రాక్టీస్ చేశాను. ఒకవేళ బెంగాల్‌ రంజీట్రోఫీ ఫైనల్‌కు అర్హత సాధిస్తే.. అక్కడ ఆడదామనుకున్నా. జట్టు సభ్యులు తెల్ల బంతితో సాధన చేస్తే.. నేను మాత్రం ఎర్ర బంతితో చేశాను. ఇక బెంగాల్‌తో కలిశాక జట్టులో మంచి వాతావరణం ఏర్పడింది. అయితే ఫైనల్లో వికెట్‌ మాత్రం మేం ఆశించినట్లు లేదు. ఇప్పుడు సాకులు చెప్పడం సరికాదు. ఏం జరిగినా మేం మంచి ప్రదర్శన చేయాల్సింది. తొలుత ఎంతో కీలకమైన టాస్‌ ఓడిపోయాం. మ్యాచ్‌ జరిగేటప్పుడు అన్ని విభాగాల్లో వెనుకబడ్డాం' అని సాహా అన్నాడు.

టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని గౌరవించాలి:

టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని గౌరవించాలి:

కివీస్‌తో టెస్టు సిరీస్‌లో తనని తీసుకోకపోవడంపై సాహా స్పందించాడు. 'సహజంగా ఏ ఆటగాడికైనా మ్యాచ్‌కు ముందు బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఎంపిక ఆధారంగా తుది జట్టు గురించి తెలుస్తుంది. నా విషయంలోనూ అలాగే జరిగింది. జట్టు యాజమాన్య నిర్ణయాలను బట్టి మెలగాల్సి ఉంటుంది. గత సిరీస్‌ ఆడినందున ఇప్పుడు కూడా ఆడతామనే భావన మనసులో ఉంటుంది. కానీ.. నేను కివీస్‌తో టెస్టు సిరీస్‌లో ఆడలేదు. కొంచెం నిరాశగానే ఉంది' అని సాహా పేర్కొన్నాడు.

పంత్‌ను ఆడించాలనుకుంటే:

పంత్‌ను ఆడించాలనుకుంటే:

'సొంత ప్రయోజనాల కంటే జట్టు అవసరాలకే నేను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తా. ఒకవేళ టీమిండియా రిషబ్ పంత్‌ను ఆడించాలనుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. జట్టు విజయం సాధిస్తే చాలు' అని సాహా చెప్పుకోచ్చాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో సాహాని రిజర్వ్ బెంచ్‌పై కూర్చోబెట్టిన టీమిండియా మేనేజ్‌మెంట్.. పంత్‌కి వరుసగా అవకాశాలిచ్చింది. ఇదే తరహాలో గత ఏడాది పంత్‌‌ని కూర్చోబెట్టి దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో సాహాని ఆడించింది. టెస్టుల్లో రెగ్యులర్‌గా ఎవర్ని ఆడిస్తారు? అనే దానిపై క్లారిటీ రావడం లేదు.

రంజీ విజేత సౌరాష్ట్ర:

రంజీ విజేత సౌరాష్ట్ర:

2019-20 సీజన్‌లో భాగంగా సౌరాష్ట్ర, బెంగాల్‌ మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ శుక్రవారం డ్రాగా ముగిసింది. సౌరాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 44 పరుగుల ఆధిక్యం కారణంగా విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే.. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించిన జట్టుకే రంజీ ట్రోఫీ దక్కనున్న విషయం తెలిసిందే. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేయగా.. బెంగాల్‌ 381 రన్స్‌ మాత్రమే చేసింది.

Story first published: Sunday, March 15, 2020, 14:04 [IST]
Other articles published on Mar 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X