న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మైదానంలోనే చనిపోయినా పర్వాలేదనుకున్నా: క్రికెట్‌ దిగ్గజం

Wouldnt mind dying doing something I love: Viv Richards opens up on batting without helmet

మెల్‌బోర్న్‌: వెస్టిండీస్‌ తరఫున ఆడుతూ మైదానంలోనే చనిపోయినా ఫర్వాలేదు అని అనుకున్నానని క్రికెట్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ చెప్పారు. తాను క్రికెట్‌ను అంత ప్రేమించానని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌ వాట్సన్‌తో గురువారం జరిగిన చిట్‌చాట్‌లో రిచర్డ్స్‌ తెలిపారు. క్రికెట్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌లలో ఒకడైన సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌.. తన సుదీర్ఘ కెరీర్‌లో ఏరోజూ హెల్మెట్‌ పెట్టుకోలేదు. ఎలాంటి భయం లేకుండానే బరిలోకి దిగిన అతను ఆ సమయంలో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్‌ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ఆటపై ఉన్న పిచ్చి ప్రేమే తనలో ధైర్యాన్ని నింపిందని రిచర్డ్స్‌ గుర్తు చేసుకున్నారు.

పేస్‌, భూప‌తి 'ఫ్రై ప్యాన్' చాలెంజ్‌ (వీడియో)పేస్‌, భూప‌తి 'ఫ్రై ప్యాన్' చాలెంజ్‌ (వీడియో)

 చనిపోయినా పర్లేదనుకున్నా:

చనిపోయినా పర్లేదనుకున్నా:

షేన్‌ వాట్సన్‌తో జరిగిన వీడియో సంభాషణ సందర్భంగా రిచర్డ్స్‌ మాట్లాడుతూ... 'క్రికెట్‌ను నేను విపరీతంగా ప్రేమించాను. ఎంతలా అంటే.. ప్రేమించే ఆట కోసం చనిపోయినా పర్వాలేదనుకునేవాణ్ని. ఒకవేళ మైదానంలోనే మరణిస్తే అంతకంటే గొప్ప చావు ఏముంటుంది?. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అత్యుత్తమ స్థాయిలో ప్రదర్శన చేసే అథ్లెట్ల నుంచి స్ఫూర్తి పొందా' అని అన్నారు.

రేసింగ్‌ కంటే ప్రమాదమా?:

రేసింగ్‌ కంటే ప్రమాదమా?:

'ఇతర ఆటగాళ్లను చూసి నేను ఎప్పుడూ స్ఫూర్తి పొందేవాడిని. అత్యుత్తమ స్థాయిలో రాణించే మహిళలను కూడా అలాగే గౌరవించేవాడిని' అని రిచర్డ్స్‌ చెప్పారు. 'ఫార్ములా వన్‌ రేసింగ్‌ కారును నడిపిస్తున్న ఓ కుర్రాణ్ని చూశా. అంతకంటే ప్రమాదకరమైంది ఇంకేముంటుంది' అని రిచర్డ్స్‌ చెప్పిన దానికి షేన్‌ వాట్సన్‌ చమత్కారంగా.. 'హెల్మెట్‌ లేకుండా 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతిని ఎదుర్కోవడం' అని తెలిపారు. రిచర్డ్స్‌ విండీస్ తరఫున 121 టెస్టులు, 187 వన్డేలు ఆడారు.

రిచర్డ్స్‌ లాంటి గొప్ప బ్యాట్స్‌మన్‌ను చూడలేదు:

రిచర్డ్స్‌ లాంటి గొప్ప బ్యాట్స్‌మన్‌ను చూడలేదు:

రిచర్డ్స్‌ లాంటి గొప్ప బ్యాట్స్‌మన్‌ను తాను ఇంతవరకు చూడలేదని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ ఇటీవలే అన్నాడు. కానీ టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ఆ విషయంలో పోటీకి వస్తున్నాడని చెప్పాడు. 'రిచర్డ్స్‌ లాంటి బ్యాట్స్‌మన్‌ను నేను ఇంత వరకూ చూడలేదు. సచిన్‌, లారా లాంటి మేటి బ్యాట్స్‌మెన్‌తో నేను ఆడా. అయితే ప్రస్తుత తరంలో మాత్రం కోహ్లీ భేష్‌. వివ్‌ స్థానంలో మరొకరిని ఊహించడం కష్టమే. కానీ కోహ్లీ ఆ దిశగా ఆలోచించేలా చేస్తున్నాడు' అని వార్న్‌ ప్రశంసించాడు.

Story first published: Friday, April 10, 2020, 8:43 [IST]
Other articles published on Apr 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X