న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్ గెలుస్తాం: వరల్డ్‌కప్‌లో రెండో అత్యధిక స్కోరు సాధించడంపై గుప్టిల్

World Cup 2019: Will do everything we can to win the trophy this time: Guptill

హైదరాబాద్: గత వరల్డ్‌కప్‌లో కొద్దిలో టైటిల్‌ను మిస్సయ్యామని... ఈసారి మాత్రం విశ్వవిజేతగా నిలిచేందుకు మా ప్రయత్నం మేం చేస్తామని న్యూజిలాండ్ జట్టు ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ అన్నాడు. వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియాతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో కివీస్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ విజయం ఆ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. తాజాగా మార్టిన గుప్టిల్ మాట్లాడుతూ "ఈ వరల్డ్‌కప్‌లో విజేతగా నిలిచేందుకు మాది ఫేవరెట్‌ జట్టని చెప్పడం లేదు. కానీ, బలమైన ఆటగాళ్లతో మా జట్టు సమతుల్యంగా ఉంది. ఈ టోర్నీ అంత తేలిక కాదని మాకూ తెలుసు. మా ప్రయత్నం మేం చేస్తాం. గత టోర్నీలో మిస్సైనా ఈసారి గెలవడానికి అంతా చేస్తాం" అని అన్నాడు.

బలమైన జట్టుగా న్యూజిలాండ్

బలమైన జట్టుగా న్యూజిలాండ్

అనుభవంతోపాటు యువ ఆటగాళ్లు న్యూజిలాండ్ జట్టు సొంతం. దీంతో ఈ వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌ బలమైన జట్టుగా కనిపిస్తోంది. ఈ వరల్డ్‌కప్‌లో పరుగుల వరద పారడం కోసం పిచ్‌లను బ్యాటింగ్‌కు అనుకూలంగా రూపొందించారు. ముఖ్యంగా గుప్టిల్ లాంటి విధ్వంసకర బ్యాట్స్‌మన్‌కు ఇంగ్లీష్‌ పిచ్‌లు స్వర్గథామాలని భావిస్తున్నారు.

గుప్టిల్‌దే కీలకపాత్ర

గుప్టిల్‌దే కీలకపాత్ర

ఈ క్రమంలో న్యూజిలాండ్ జట్టు విజయాల్లో గుప్టిల్ కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. 2015 వరల్డ్‌కప్‌లో కివీస్ తొలిసారి ఫైనల్‌ చేరింది. అయితే, ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. 2015 టోర్నీలో గుప్టిల్ 68.37 యావరేజితో మొత్తం 547 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ వరల్డ్‌కప్‌లో మరోసారి రాణించేందుకు గుప్టిల్ సిద్ధంగా ఉన్నాడు.

రెండో అత్యధిక స్కోర్‌

రెండో అత్యధిక స్కోర్‌

దీనిపై గుప్టిల్ మాట్లాడుతూ "వరల్డ్‌కప్‌లాంటి మెగా టోర్నీల్లో రెండో అత్యధిక స్కోర్‌ సాధించడం చాలా సంతోషంగా ఉంది. వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీల్లో ఆటగాళ్లకు అలాంటి నమ్మకమే కావాలి. నమ్మకంతో ముందుకు సాగకపోతే రాణించలేం. ఈసారి కూడా అదే నమ్మకంతో ముందుకు సాగుతా" అని తెలిపాడు.

ఇంగ్లీషు గడ్డపై మెరుగైన రికార్డు

ఇంగ్లీషు గడ్డపై మెరుగైన రికార్డు

ఇంగ్లీషు గడ్డపై మార్టిన్ గుప్టిల్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు 97.31 స్ట్రైక్‌ రేట్‌తో 652 పరుగులు చేశాడు. అత్యధికంగా 155 బంతుల్లో 189 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న 12వ ఎడిషన్‌లో న్యూజిలాండ్ జట్టు గెలుపు గుర్రాలుగా బరిలోకి దిగుతోంది.

Story first published: Tuesday, May 28, 2019, 12:39 [IST]
Other articles published on May 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X