న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాకిస్థాన్ చేతిలో ఓటమి: ఐపీఎల్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన డుప్లెసిస్

ICC Cricket World Cup 2019 : Faf du Plessis Blames IPL As South Africa Exit World Cup || Oneindia
World Cup 2019: Tried to stop Rabada from taking part in IPL, reveals Faf du Plessis

హైదరాబాద్: ఐపీఎల్ ఆడకుండా ఉంటే ఈ ప్రపంచకప్‌లో పరిస్థితి మరోలా ఉండేదని దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ వెల్లడించాడు. పనిభారంతో సఫారీ ఆటగాళ్లు ఈ మెగా టోర్నీలో సరైన ప్రదర్శన చేయలేకపోయారని తెలిపాడు. టోర్నీలో భాగంగా ఆదివారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ ఓటమితో దక్షిణాఫ్రికా ప్రపంచకప్‌‌లో సెమీస్ నుంచి తప్పుకున్నట్లు అయింది. ఈ మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో డుప్లెసిస్ మాట్లాడుతూ "మా ఓటమిపై సరైన సమాధానం చెప్పలేకపోతున్నాను. మేం అసలు ఐపీఎల్‌ ఆడకుండా ఉండాల్సింది. కనీసం రబాడనైనా ఐపీఎల్‌లో ఆడకుండా అడ్డుకోని ఉండాల్సింది. అతను ఐపీఎల్‌ ఆడకుండా ఉంటే పరిస్థితి మరోలా ఉండేది" అని తెలిపాడు.

ఐపీఎల్‌‌లో ఆడటం వల్లే

ఐపీఎల్‌‌లో ఆడటం వల్లే

"అయితే, ఐపీఎల్‌‌లో ఆడటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పడం లేదు. కానీ, కొంత మంది ఆటగాళ్లకు విశ్రాంతినిస్తే.. పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగేది. నూతన ఉత్సాహాంతో బరిలోకి దిగేవారు. విశ్రాంతి లేకుండా ఆడితే ఇలాంటి ఫలితాలే ఎదురవుతాయి. ఈ ప్రపంచకప్‌లో గాయాలు కూడా మా గెలుపుపై ప్రభావం చూపాయి" అని డుప్లెసిస్ అన్నాడు.

పేసర్లు గాయాలు కూడా

పేసర్లు గాయాలు కూడా

"జట్టులోని మిగతా పేసర్లు గాయాలు కూడా రబాడపై ప్రభావం చూపాయి. అతనొక్కడే భారాన్ని మోసాడు. ఇది అతని బౌలింగ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. టోర్నీ ఆరంభంలో రాణించకుంటే, మనపై మనకు ఉన్న నమ్మకాన్ని కోల్పోతాం. రబాడ విషయంలో కూడా అదే జరిగింది. అయితే, అతను ఎదో ఒకటి చేయాలని చాలా ప్రయత్నించాడు" అని డుప్లెసిస్ తెలిపాడు.

పనిభారం కారణంగా

పనిభారం కారణంగా

6 మ్యాచ్‌ల్లో రబాడ 50.83 సగటుతో కేవలం 6 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. పనిభారం కారణంగా ఈ ప్రపంచకప్‌లో అతడు మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాడు. అదే ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున 12 మ్యాచ్‌ల్లో 25 వికెట్లు తీశాడు. గాయం నుంచి కోలుకున్న ఆ జట్టు పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ ఐపీఎల్‌లో ఆడటంతో గాయపడ్డాడు.

లీగ్ దశ నుంచే నిష్క్రమణ

లీగ్ దశ నుంచే నిష్క్రమణ

దీంతో ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. ఇదిలా ఉంటే, ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లాడిన దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్‌లో విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దు అయింది. దీంతో సెమీస్‌ అవకాశాల్ని పూర్తిగా కోల్పోయి... లీగ్‌ దశలోనే వెనుదిరిగింది.

Story first published: Monday, June 24, 2019, 12:38 [IST]
Other articles published on Jun 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X