న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గృహహింస కేసు.. యువరాజ్‌ సింగ్‌కు భారీ ఊరట

Withdraws Case: Akansha Sharma withdraws domestic violence case against Yuvraj Singh


ఢిల్లీ:
గృహ హింస కేసులో టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌కు భారీ ఊరట లభించింది. యువరాజ్‌పై చేసిన ఆరోపణలు, ఫిర్యాదులన్నీ అవాస్తవాలని సోదరుడు జోరావర్‌ భార్య ఆకాంక్ష శర్మ అంగీకరించిందని యువీ కుటుంబ సభ్యులు తెలిపారు. లబ్ధి కోసమే ఆకాంక్ష కేసు పెట్టినట్లు యువీ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇక నుంచి యువరాజ్‌ ప్రశాంతంగా ఉండగలడని వారు తెలిపారు.

యాషెస్‌ ఐదవ టెస్టు.. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌యాషెస్‌ ఐదవ టెస్టు.. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌

విడాకులు మంజూరు:

విడాకులు మంజూరు:

యువీ సోదరుడు జొరావర్‌ సింగ్‌ భార్య ఆకాంక్ష సింగ్‌. పెళ్లైన ఆరు నెలలకే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. 2017లో భర్తతో పాటు యువరాజ్‌ సింగ్‌, అతని తల్లి షబ్నామ్‌ సింగ్‌లపై ఆకాంక్ష గృహ హింస కేసు పెట్టారు. అయితే నాలుగు సంవత్సరాల న్యాయ పోరాటం తరువాత ఈ ఏడాది సెప్టెంబర్‌ మొదటి వారంలో జొరావర్‌-ఆకాంక్షలకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఇక యువరాజ్ మరియు అతని కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆకాంక్ష క్షమాపణలు చెప్పారు.

 ఆరోపణలు అబద్ధం:

ఆరోపణలు అబద్ధం:

'నా పెళ్ళి సంబంధిత వివాదం పరిష్కరించబడింది. జోరావర్ సింగ్ మరియు యువరాజ్ సింగ్‌పై అనుకోకుండా చేసిన ఆరోపణల వలన చాలా బాధపడ్డారు. అందుకు నేను చింతిస్తున్నా. వారిపై నేను చేసిన ఆరోపణలు అబద్ధం. నా ఆరోపణలన్నింటినీ ఉపసంహరించుకున్నా. యువరాజ్‌, అతని కుటుంబ సబ్యులకు క్షమాపణలు' అని ఆకాంక్షలేఖలో పేర్కొన్నారు.

 యువీని చూసి గర్విస్తున్నాం:

యువీని చూసి గర్విస్తున్నాం:

'చట్టం నుంచి తప్పించుకోలేనని ఆకాంక్ష తాను చేసిన ఆరోపణలు, ఫిర్యాదులు అవాస్తవమని అంగీకరించింది. అన్ని ఆరోపణలను ఉపసంహరించుకుంది. కోట్లాది అభిమానులున్న యువీ పేరును అడ్డం పెట్టుకుని మమ్మల్ని టార్గెట్‌ చేశారు. గృహ హింస పేరుతో యువీ ప్రతిష్టకు భంగం కల్గించాలని ఆకాంక్ష చూశారు. చట్టంపై నమ్మకంతో యువీ పోరాడాడు. యువీని చూసి మేం గర్విస్తున్నాం' అని యువీ కుటుంబ సభ్యులు అన్నారు.

Story first published: Thursday, September 12, 2019, 16:48 [IST]
Other articles published on Sep 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X