న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రికార్డులివే: బుమ్రా 5 హాల్, టీమిండియా అతి పెద్ద విజయం, కోహ్లీ మైలురాయి

India Vs West Indies 2019 : Team India Biggest Overseas Test Win, Registers Some Unique Records
Windies vs India 2019, 1st Test: Bumrah’s record 5-fer, India’s biggest win, Kohli’s milestone win and more stats

హైదరాబాద్: వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. ఛాంపియన్‌షిప్‌లో భాగంగా వెస్టిండిస్‌తో జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో తొలి టెస్టులో 318 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఫలితంగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

<strong>అరుదైన ఘనత: న్యూజిలాండ్ తరుపున నాలుగో బౌలర్‌గా టిమ్‌ సౌథీ</strong>అరుదైన ఘనత: న్యూజిలాండ్ తరుపున నాలుగో బౌలర్‌గా టిమ్‌ సౌథీ

ఈ విజయంతో టీమిండియా 60 పాయింట్లు సాధించింది. తొలిరోజు తొలి సెషన్లోనే మూడు వికెట్లు కష్టాల్లో పడిన టీమిండియాను వైస్ కెప్టెన్ రహానే ఆదుకున్నాడు. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు ఇషాంత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా ఐదు వికెట్లతో రాణించారు.

419 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా విజృంభించడంతో వెస్టిండిస్ 50/9 స్థితిలో నిలిచింది. అయితే, వెస్టిండిస్ బ్యాట్స్‌మన్ కీమర్ రోచ్ 31 బంతుల్లో 38 పరుగులు చేయడంతో టీమిండియా విజయం కాస్త ఆలస్యమైంది.

ఈ క్రమంలో కీమర్ రోచ్ ఆఖరి వికెట్‌కు 50 పరుగులు జోడించి వెస్టిండిస్ రెండో ఇన్నింగ్స్‌లో 100 పరుగుల మార్కుని అందుకునేలా చేశాడు. ఇదిలా ఉంటే, తొలి టెస్టులో టీమిండియా పలు రికార్డులను బద్దలు కొట్టింది. అవేంటో ఒక్కసారి చూద్దాం...

టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం

టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం

318- స్కోరు పరంగా భారతదేశం బయట టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం. అంతకుముందు (2017) గాలెలో శ్రీలంకపై 304 పరుగుల తేడాతో విజయం సాధించింది.

1 - టీమిండియా తరఫున విదేశాల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో విరాట్‌ కోహ్లీ... ధోనీతో సంయుక్తంగా నిలిచాడు. 12 టెస్టు విజయాలతో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (11) రికార్డును బద్దలు కొట్టాడు. స్వదేశంలో, విదేశాల్లో కలిసి విరాట్‌ కోహ్లీ మొత్తం 27 టెస్టు విజయాలు నమోదు చేశాడు.

వంద మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా

వంద మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా

100- అంతర్జాతీయ క్రికెట్‌లో వంద మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా మూడో కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. మొత్తంగా చూస్తే 12వ ఆటగాడు. ఆంటిగ్వా మ్యాచ్‌ కోహ్లీకి కెప్టెన్‌గా 152వది కావడం విశేషం. వందకు పైగా గెలిచిన వారిలో రికీ పాంటింగ్‌ (134), స్టీవ్‌ వా (150), హన్సీ క్రో (151) ఈ జాబితాలో కోహ్లీ కంటే ముందు వరుసలో ఉన్నారు.

1- జస్ప్రీత్‌ బుమ్రా ఐదు వికెట్ల ఘనతను నాలుగు వేర్వేరు దేశాల్లో అందుకున్నాడు. ఇప్పటివరకు నాలుగు వేర్వేరు పర్యటనలలో (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్) 5 వికెట్ హాల్ సాధించాడు. ఈ ఘనత సాధించిన మొదటి భారత బౌలర్. అంతేకాదు ఆ నాలుగు దేశాలలో ఐదు వికెట్లు పడగొట్టిన ఆసియా మొదటి బౌలర్ కూడా. కేవలం 11 మ్యాచుల్లోనే ఈ ఘనత అందుకోవడం ప్రత్యేకం. ఈ నాలుగు దేశాలలో మొట్టమొదటి పర్యటనలోనే 5 వికెట్ హాల్ సాధించడం మరో విశేషం.

మీరే చూడండి: బంతిని కాదు లియాన్ జారవిడించింది.. యాషెస్ ట్రోఫీని! (వీడియో)

7 పరుగులకే 5 వికెట్లు

7 పరుగులకే 5 వికెట్లు

5/7 - రెండో ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా కేవలం 7 పరుగులకే 5 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో ఐదు వికెట్లు తీసి అతి తక్కువ పరుగులు ఇచ్చిన నాలుగో బౌలర్‌‌గా గుర్తింపు పొందాడు. భారత్‌లో మాత్రం తొలి ఆటగాడు. అంతకు ముందు వెంకటపతి రాజు 6/12 శ్రీలంకపై 1993లో సాధించాడు.

15/5 - రెండో ఇన్నింగ్స్‌లో విండీస్‌ 15 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకుంది. ఆ తర్వాత 37/7తో నిలిచింది. విండీస్‌కు ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 5, 7 వికెట్ల వద్ద రెండో అత్యల్ప స్కోర్లు ఇవే కావడం విశేషం.

టాప్‌-5 బ్యాట్స్‌మన్‌ను సింగిల్ డిజిట్‌కే

టాప్‌-5 బ్యాట్స్‌మన్‌ను సింగిల్ డిజిట్‌కే

3 - రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండిస్ టాప్‌-5 బ్యాట్స్ మన్‌ను టీమిండియా సింగిల్ డిజిట్‌కే పరిమితం చేసింది. టెస్టు ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థిని ఇలా ఒకే అంకెకు పరిమితం చేయడం మూడో సారి.

38 - కరేబియన్ దీవుల్లో ఇషాంత్ శర్మ మొత్తం 38 వికెట్లు తీశాడు. ఫలితంగా పర్యాటక బౌలర్లలో ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు.య ఇషాంత్ శర్మకు ముందు ఈ జాబితాలో అలీ ఫ్రేసర్(54), గ్లెన్ మెక్‌గ్రాత్(50), ఇమ్రాన్ ఖాన్ (48) ముందున్నారు.

18 - ఈ మ్యాచ్‌లో టీమిండియా పేసర్లు మొత్తం 18 వికెట్లు తీశారు. 1997లో బ్రిడ్జ్‌టౌన్‌లో ఇలా జరిగింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో అన్ని వికెట్లూ పేసర్లే తీశారు. విండీస్‌లో ఒక ఇన్నింగ్స్‌లో పేసర్లు 10 వికెట్లు తీయడం ఇదే తొలిసారి.

Story first published: Monday, August 26, 2019, 19:09 [IST]
Other articles published on Aug 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X