నాథన్ లియాన్ చిన్నపాటి తప్పిదం యాషెస్ ట్రోఫీకే ఎసరుపెట్టింది (వీడియో)

హైదరాబాద్: ఐదు టెస్టుల యాషెస్ సిరిస్. ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే... ప్రతిష్టాత్మక యాషెస్ ట్రోఫీని సొంతం చేసుకుని ఉండేది.
అయితే, మూడో టెస్టు ఫలితం తారుమైంది. ఆతిథ్య ఇంగ్లాండ్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. ఇందుకు కారణం బెన్ స్టోక్స్ వీరోచిత ఇన్నింగ్స్. ఆస్ట్రేలియా నిర్దేశించిన 359 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 9 వికెట్లు కోల్పోయి ఓటమి ఖాయమైన స్థితిలో తన అసమాన పోరాటంతో బెన్ స్టోక్స్ జట్టుకు విజయాన్ని అందించాడు.

11వ బ్యాట్స్‌మన్ లీచ్‌తో
11వ బ్యాట్స్‌మన్ లీచ్‌తో కలిసి పదో వికెట్‌కు అజేయంగా 76 పరుగులు జోడించి ఇంగ్లాండ్‌కు చారిత్రక విజయాన్ని అందించాడు. నిజానికి మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించాలి. అయితే, ఆ జట్టు కెప్టెన్ టిమ్ పైన్ డీఆర్ఎస్ నిర్ణయం తప్పిదమో లేక స్పిన్నర్ నాథన్ లియాన్ ధారాళంగా పరుగులు సమర్పించుకోవడమో ఆసీస్‌ను దురదృష్టం వెంటాడింది.

జట్టు స్కోరు 357 పరుగుల వద్ద
ఇంగ్లాండ్ జట్టు స్కోరు 357 పరుగుల వద్ద లీచ్‌ను అత్యంత తేలిగ్గా రనౌట్ చేసే అవకాశాన్ని లియాన్ వదిలేశాడు. నాథన్ లియాన్ వేసిన బంతిని క్రీజులో ఉన్న బెన్ స్టోక్స్ రివర్స్ స్పీప్ షాట్ అడాడు. అదే సమయంలో నాన్ స్ట్రయింగ్ ఎండ్‌లో ఉన్న లీచ్ బంతిని గమనించకుండా క్రీజును వదిలి పిచ్ సగభాగం వరకు వెళ్లాడు.
బెన్ స్టోక్స్ అతడిని వారించగా
అదే సమయంలో బెన్ స్టోక్స్ అతడిని వారించగా తిరిగి వెనక్కి పరిగెత్తే క్రమంలో ఫీల్డర్ నుంచి త్రోను అందుకున్న నాథన్ లియాన్ వికెట్లను గిరాటేసే సమయంలో బంతి చేజారింది. దీంతో ఇంగ్లీషు అభిమానులు ఒక్కసారిగా సంబరాలు చేసుకున్నాడు. ఆ సమయంలో నాథన్ లియాన్‌కు తెలియదు పాపం తాను జారవిడించింది యాషెస్ ట్రోఫీనీనని.

లయాన్ చేసిన అప్పీల్‌ను అంపైర్
అయితే, ఆ తర్వాత అదే స్కోరు వద్ద బెన్ స్టోక్స్ ఎల్బీ కోసం లయాన్ చేసిన అప్పీల్‌ను అంపైర్ విల్సన్ తిరస్కరించాడు. అప్పటికీ ఆస్ట్రేలియా రివ్యూలు అయిపోవడంతో బెన్ స్టోక్స్ బ్రతికి పోయాడు. అయితే, బంతి మిడిల్ వికెట్‌కు వెళుతున్నట్లు రిప్లేలో తేలింది. అదే, ఆస్ట్రేలియాకు రివ్యూ గనుక ఉండి ఉంటే స్టోక్స్ ఔటయ్యేవాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications