న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రభుత్వం వద్దంటే ఆడం: స్పష్టం చేసిన రవిశాస్త్రి

Will not play ICC World Cup 2019 if government decides so: Ravi Shastri on Indo-Pak boycott talks

హైదరాబాద్: వరల్డ్‌కప్‌లో పాక్‌తో మ్యాచ్‌ని ప్రభుత్వం వద్దంటే.. టోర్నీ నుంచి తప్పుకుంటామని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ప్రభుత్వం, బీసీసీఐ తీసుకునే నిర్ణయమే తమకు శిరోధార్యమని తెలిపాడు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌ను భారత్ ఆడకూడదని అటు మాజీ క్రికెటర్లతో పాటు ఇటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తున్నారు.

ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలతో సంబంధాలు తెంచుకోవాలి: ఐసీసీకి బీసీసీఐ లేఖఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలతో సంబంధాలు తెంచుకోవాలి: ఐసీసీకి బీసీసీఐ లేఖ

రవిశాస్త్రి మాట్లాడుతూ

రవిశాస్త్రి మాట్లాడుతూ

దీంతో మ్యాచ్‌ ఆడటంపై ఇప్పటి వరకూ స్పష్టమైన నిర్ణయం తీసుకోని బీసీసీఐ.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఓ జాతీయా ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో రవిశాస్త్రి మాట్లాడుతూ "ఈ విషయంపై ఏం జరుగుతుందనేది మాకంటే బీసీసీఐ, ప్రభుత్వానికే ఎక్కువగా తెలుసు. దీనిపై తుది నిర్ణయం వాళ్లే తీసుకుంటారు" అని అన్నాడు.

వాళ్ల నిర్ణయం ప్రకారమే మేం నడుచుకోవాలి

వాళ్ల నిర్ణయం ప్రకారమే మేం నడుచుకోవాలి

"ఈ అంశంలో మేం చేసేదేమీ లేదు. వాళ్ల నిర్ణయం ప్రకారమే మేం నడుచుకోవాలి. ఒకవేళ ఈ అంశం సున్నితమైంది. మీరు ప్రపంచకప్ ఆడొద్దని మా ప్రభుత్వం చెబితే మొత్తం టోర్నీనే రద్దు చేసుకుంటాం" అని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా జూన్‌ 16న భారత్‌-పాక్‌ మ్యాచ్‌ జరగనుంది. ఇరు జట్లు 2012-13 నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు.

పుల్వామా దాడి నేపథ్యంలో

పుల్వామా దాడి నేపథ్యంలో

కేవలం ఐసీసీ, ఆసియా కప్‌ లాంటి మెగా టోర్నీల్లో మాత్రమే తలపడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు పుల్వామా దాడి నేపథ్యంలో ఐసీసీకి బీసీసీఐ ఓ లేఖ రాసింది. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో ఆటగాళ్లు, అధికారులు, అభిమానుల భద్రత విషయంపై తాము ఆందోళన చెందుతామని అందులో పేర్కొంది. ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న దేశాలతో క్రికెట్ మ్యాచ్ జరుగకుండా చూడాలని కోరింది.

పాక్‌తో మ్యాచ్‌పై ఐసీసీకి బీసీసీఐ లేఖ

పాక్‌తో మ్యాచ్‌పై ఐసీసీకి బీసీసీఐ లేఖ

అలాంటి దేశాలను ఐసీసీ నుంచి తొలగించాలని డిమాండ్ కూడా చేసింది. భారత్ జట్టు ఒకవేళ పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తే? అప్పుడు పాకిస్థాన్‌ను విజేతగా ప్రకటించి రెండు పాయింట్లు కేటాయిస్తారు. అదే జరిగితే ఇప్పటి వరకూ ప్రపంచకప్‌లో భారత్‌పై ఒక్కసారి కూడా గెలుపొందని పాకిస్థాన్‌ను చేజేతులా మనమే తొలిసారి గెలిపించినట్లవుతుందని దిగ్గజ క్రికెటర్లు సచిన్, గవాస్కర్‌లు అన్నారు. అలాకాకుండా పాక్‌ను ఓడించాలని వారిద్దరూ సూచించారు.

Story first published: Saturday, February 23, 2019, 13:01 [IST]
Other articles published on Feb 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X