న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2020: ధోని తర్వాత రెండో కెప్టెన్‌గా గౌరవంగా ఉంటుంది: కోహ్లీ

T20 World Cup 2020 : Virat Kohli Hopes To Emulate Dhoni's Achievement During T20 World Cup Next Year
Will be an honour to become 2nd Indian captain to lift T20 World Cup trophy: Virat Kohli


హైదరాబాద్:
వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీలో ట్రోఫీ కోసం పోటీ పడేందుకు తర్వాతి 12 నెలలు ఉపయోగించుకుంటామని కోహ్లీ అన్నాడు.

తాజాగా ఐసీసీకి ఇచ్చిన ఇంటర్యూలో "2020లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌పై దృష్టిసారించాం. రాబోయే 12 నెలలు మాకెంతో కీలకం. ఈ టోర్నీలో ట్రోఫీ కోసం పోటీ పడేందుకు తర్వాతి 12 నెలలు ఉపయోగించుకుని అత్యుత్తమ ప్రదర్శన చేస్తాం" అని విరాట్ కోహ్లీ తెలిపాడు. ధోని తర్వాత టీ20 వరల్డ్‌కప్ నెగ్గిన రెండో కెప్టెన్‌గా నిలవడం గౌరవంగా ఉంటుందని అన్నాడు.

పాకిస్థాన్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించడంపై సర్ఫరాజ్ స్పందన ఇదీ!పాకిస్థాన్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించడంపై సర్ఫరాజ్ స్పందన ఇదీ!

ఆరంభ సీజన్‌లో

ఆరంభ సీజన్‌లో

దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన 2007 ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ ఆరంభ సీజన్‌లో ధోని నాయకత్వంలోని టీమిండియా తొలి వరల్డ్‌కప్‌ను నెగ్గిన సంగతి తెలిసిందే. దీనిపై కోహ్లీ మాట్లాడుతూ "2007లో టీ20 వరల్డ్‌కప్ ఆరంభ సీజన్‌లో టీమిండియా విజయం సాధించింది. టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని ఎత్తిన రెండవ భారత కెప్టెన్ కావడం గౌరవంగా ఉంటుంది" అని అన్నాడు.

ఆస్ట్రేలియా నుంచి తిరిగొచ్చేటప్పుడు

ఆస్ట్రేలియా నుంచి తిరిగొచ్చేటప్పుడు

"అయితే, 2020 ఆరంభంలోనే భారత మహిళల జట్టు ట్రోఫీని గెలిస్తే మూడోది అవుతుంది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చేటప్పుడు మరిన్ని చూడాలని ఆశిస్తున్నాను" అని విరాట్ కోహ్లీ అన్నాడు. విరాట్ కోహ్లీ నాయకత్వంలో టీమిండియా ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా నెగ్గలేదు.

ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవని కోహ్లీ

ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవని కోహ్లీ

2017లో కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఫైనల్స్‌కు చేరినప్పటికీ... పాకిస్థాన్ చేతిలో ఓడిపోవడంతో రన్నరప్‌గా మిగిలింది. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 18 పరుగులు తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు

అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు

భారత్ వేదికగా 2016లో చివరగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో వెస్టిండిస్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లను టీ20 వరల్డ్‌కప్‌కు సన్నద్ధం చేస్తున్నట్లు విరాట్ కోహ్లీ తెలిపాడు. 2020లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు జరగనుంది.

Story first published: Friday, October 18, 2019, 17:18 [IST]
Other articles published on Oct 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X