న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అనుష్కతో కలిసి సిడ్నీ మైదానంలో విరాట్ కోహ్లీ 'విక్టరీ వాక్' (వీడియో)

India vs Australia : Virat Kohli ‘Victory Walk’ With Wife Anushka Sharma In Sydney | Oneindia Telugu
Wife Anushka Sharma Goes On ‘Victory Walk’ with Virat Kohli in Sydney, See Video

హైదరాబాద్: ఆసీస్ గడ్డపై టీమిండియా తొలిసారి చారిత్రక టెస్టు సిరీస్‌ను సాధించిన నేపథ్యంలో కెప్టెన్ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో సందడి చేశాడు. సిడ్నీ టెస్టు డ్రాగా ముగియడంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-1తో టీమిండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

2-1తో సిరిస్ కైవసం: సిడ్నీలో టీమిండియా విక్టరీ డ్యాన్స్ చూశారా? (వీడియో)2-1తో సిరిస్ కైవసం: సిడ్నీలో టీమిండియా విక్టరీ డ్యాన్స్ చూశారా? (వీడియో)

దీంతో ఆసీస్ గడ్డపై 72 ఏళ్ల విరామానికి టీమిండియా తెరదించింది. ఈ సిరీస్‌ విజయాన్ని విరాట్ కోహ్లీ... అనుష్కతో కలిసి పంచుకున్నాడు. టెస్టు సిరిస్ గెలిచిన ఆనందంలో సిడ‍్నీ గ్రౌండ్‌లో భార్య అనుష్కతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. తన భార్య అనుష్కపై చేయి వేసి కోహ్లీ మైదానంలో కలియదిరిగాడు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. గత గురువారం సిడ్నీ వేదికగా ప్రారంభమైన చివరి టెస్టులో టీమిండియా విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ వర్షం పదే పదే అంతరాయ కలిగించడంతో పూర్తి ఆట సాధ్యం కాలేదు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 622/7 డిక్లేర్‌ చేయగా, ఆసీస్‌ తన మొదటి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆలౌటైంది.

సిడ్నీ టెస్టులో వరుణుడి ఆటంకం

దీంతో ఆస్ట్రేలియాను కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫాలో ఆన్‌‌కు ఆహ్వానించాడు. నాలుగో రోజైన ఆదివారం ఆటలో ఆస్ట్రేలియా వికెట్‌ కోల్పోకుండా ఆరు పరుగుల వద్ద ఉన్న సమయంలో వర్షం పడింది. చివరి రోజు ఆటకు సైతం వరుణుడు అడ్డుపడటంతో ఒక్క బంతి కూడా పడలేదు. దాంతో సిడ్నీ టెస్టు డ్రాగా ముగిసింది.

పుజారాకు మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డు

సిడ్నీ టెస్టులో సెంచరీ సాధించిన ఛటేశ్వర్ పుజారా(193) మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుతో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్నాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించగా, పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో ఆసీస్‌ 146 పరుగుల తేడాతో నెగ్గింది.

2-1తో సిరిస్ నెగ్గిన టీమిండియా

ఆ తర్వాత మెల్‌ బోర్న్‌ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 137 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించి సిరిస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరిస్‌లో పుజారా 521 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా, భారత బౌలర్లలో బుమ్రా (21 వికెట్లు) అగ్రస్థానంలో నిలవగా షమీ 16 వికెట్లు, ఇషాంత్‌ శర్మ 11 వికెట్లు తీశారు.

Story first published: Monday, January 7, 2019, 14:59 [IST]
Other articles published on Jan 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X