న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆఫ్ఘనిస్థాన్ కోచ్‌గా వెస్టిండిస్ గ్రేట్ సిమ్మన్స్

By Nageshwara Rao
WI great Phil Simmons named Afghanistan head coach

హైదరాబాద్: ఆఫ్ఘనిస్థాన్ కొత్త కోచ్‌గా వెస్టిండీస్ మాజీ క్రికెట్ దిగ్గజం ఫిల్‌ సిమ్మన్స్‌ నియమితుడయ్యాడు. లాల్‌చంద్ రాజ్‌పుత్ రాజీనామాతో ఖాళీ అయిన కోచ్ స్థానాన్ని ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) సిమ్మన్స్‌తో భర్తీ చేసింది. ఈ మేరకు ఆప్ఘన్ ప్రధాన కోచ్‌గా సిమ్మన్స్ వ్యవహరిస్తాడని ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఆదివారం ప్రకటించింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జింబాబ్వేతో జరిగే వన్డే సిరీస్‌తో సిమ్మన్స్ కోచ్‌గా బాధ్యతలను స్వీకరించనున్నాడు. ఇటీవలే ఐర్లాండ్‌తో కలిసి టెస్టు హోదా దక్కించుకున్న ఆఫ్ఘనిస్థాన్... 2019లో భారత్‌తో తన తొలి టెస్టు ఆడనుంది. ఈ నేపథ్యంలో సిమ్మన్స్‌.. ఆఫ్ఘన్‌ జట్టును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతాడన్న విశ్వాసాన్ని బోర్డు వ్యక్తం చేసింది.

గతంలో జింబాబ్వే, ఐర్లాండ్‌తో పాటు వెస్టిండీస్ కోచ్‌గా సిమ్మన్స్ పనిచేశాడు. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయంగా తన ఉనికిని చాటుకుంటున్న ఆఫ్ఘనిస్థాన్ జట్టు 2019లో జరగనున్న వన్డే వరల్డ్ కప్‌కు అర్హత సాధించడమేనని తన లక్ష్యమని సిమ్మన్స్‌ చెప్పాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 1, 2018, 9:53 [IST]
Other articles published on Jan 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X