న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లంక చేతిలో ఓటమి తర్వాత రవిశాస్త్రి సీరియస్.. ఇలాగేనా టీం? ఇంట్లో షమీ చెక్క భజన చేసుకోవాలా?

Why Shami Should sit at home? Ravi Shastri fire On team management

ఆసియా కప్ టీ20 టోర్నమెంట్‌కు నలుగురు (హార్దిక్ పాండ్యాతో సహా) పేసర్లను మాత్రమే ఎంపిక చేసిన భారత జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశ్నించాడు. ఐపీఎల్లో అద్భుతంగా రాణించినప్పటికీ అనుభవజ్ఞుడైన మహ్మద్ షమీని ఇంట్లో కూర్చోబెట్టడం పట్ల తాను ఆశ్చర్యపోయానని చెప్పాడు. మంగళవారం జరిగిన ఆసియా కప్‌లో తమ సూపర్ ఫోర్-స్టేజ్ మ్యాచ్‌లో శ్రీలంకపై ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైన భారత్ ఎలిమినేషన్‌కు చేరువైంది. ఇతర జట్ల దయ ఉంటే తప్పా టీమిండియా ఇక ఫైనల్ చేరడం కష్టమే. ఈ మ్యాచ్ అనంతరం రవిశాస్త్రి పలు వ్యాఖ్యలు చేశారు.

ఐపీఎల్లో అదరగొట్టినప్పటికీ..

షమీ చివరిసారిగా టీ20ల్లో ఇండియా తరఫున 2021 టీ20 ప్రపంచ కప్‌లో ఆడాడు. ఇకపోతే ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌ జట్టు తరఫున ఆడిన షమీ అద్భుతంగా రాణించాడు. అయినప్పటికీ అతన్ని ఆసియా కప్ టోర్నీకి ఎంపికచేయలేదు. గుజరాత్ టైటాన్స్ తమ తొలి సీజన్‌లోనే ట్రోఫీని అందుకోవడంలో షమీ కీలక పాత్ర పోషించాడు. అతను 16 గేమ్‌లలో 20వికెట్లతో 24.40సగటుతో సత్తా చాటాడు. భారత ఆసియా కప్ జట్టులో అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్‌లను మాత్రమే తీసుకున్న జట్టు మేనేజ్ మెంట్ షమీని పక్కనపెట్టింది. ఇక ప్రస్తుత సూపర్ 4 స్టేజులో భారత్ రెండు వరుస మ్యాచ్‌లలో ఓడిపోవడానికి ప్రధాన కారణం బౌలింగ్ వైఫల్యమని స్పష్టమవుతుంది.

షమీ విషయంలో జట్టు మేనేజ్ మెంట్ తేల్చుకోవాలి

'మీరు ఆసియా కప్ టోర్నీకి కేవలం నలుగురు ఫాస్ట్ బౌలర్లతో దుబాయ్ వెళ్లడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీకు అయిదో పేసర్ తప్పకుండా అవసరం. ఇంటికి పరిమితమైన మహ్మద్ షమీ లాంటి ప్లేయర్ ఈ స్టేజులో భారత్‌కు ఎంతో అవసరమయ్యేవాడు. అతని అబ్సెన్స్ నన్ను కలవరపెడుతుంది. ఐపీఎల్ తర్వాత అతను టీ20ల్లో భారత జట్టుకు ఎంపిక కాలేకపోయాడు.' అని శాస్త్రి బ్రాడ్‌కాస్టర్లతో చెప్పాడు. రవిశాస్త్రి వ్యాఖ్యల బట్టి షమీ ఇంట్లో కూచుని చెక్క భజన చేసుకోవాలా.. లేక గ్రౌండ్లో చెలరేగాలా తేల్చుకోవాల్సిన అవసరముందని జట్టు మేనేజ్‌మెంట్‌కు చెప్పకనే చెప్పేశాడు. వచ్చే టీ20 వరల్డ్ కప్ టైంకు భారత జట్టు ఎంపికలో మార్పులు ఉండే వీలుంది.

కోచ్ చేతిలో సెలెక్షన్ ఉండదు కానీ..?

కోచ్ చేతిలో సెలెక్షన్ ఉండదు కానీ..?

ఇక కామెంట్రీ ప్యానెల్లో వసీం అక్రమ్ రవిశాస్త్రిని ఓ మాట అడిగాడు. జట్టును ఎంపిక చేయడంలో కోచ్‌కి ఇన్‌పుట్ ఉంటుందా ? అని దానికి రవిశాస్త్రి స్పందిస్తూ.. కోచ్ చేతిలో సెలెక్షన్ ఉండదు కానీ.. అతను సెలెక్షన్ విషయంలో సహకారం అందించగలడని. కొన్ని సజెషన్స్ మాత్రం ఇవ్వగలడు' అని రవిశాస్త్రి తెలిపాడు. ముఖ్యంగా షమీ న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో జరిగిన హోమ్ సిరీస్‌లలో ఆడలేదు. అతను ఐర్లాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్‌తో జరిగిన విదేశీ సిరీస్‌లకు కూడా ఎంపిక కాలేదు. షమీ ఇప్పటివరకు 17 టీ20ల్లో 31.55 సగటుతో 18 వికెట్లు తీశాడు.

Story first published: Wednesday, September 7, 2022, 12:25 [IST]
Other articles published on Sep 7, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X