న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వైడ్లు వేయడంలో పోటీపడ్డ భారత పేసర్లు.. ఎక్సట్రాలే 29.. ఇవే కోహ్లీసేన కొంప ముంచాయి!

Why did India lose their 1st ODI against New Zealand

హమిల్టన్: భారత జైత్రయాత్రను అడ్డుకున్న న్యూజిలాండ్.. వరుస పరాజయాల పరంపరకు విరామం ప్రకటించింది. టీ20 సిరీస్‌లో 0-5తో క్లీన్ స్వీప్ అయినా.. మూడు వన్డేలో సిరీస్‌లో మాత్రం 1-0తో ఆధిక్యంలో నిలిచింది. బంతిపై పట్టుకోల్పోయిన భారత బౌలర్లను ఓ ఆట ఆడుకుంది. బౌండరీల మోతతో భారీ లక్ష్యాన్ని సునాయసంగా కరిగించింది. ఇక బ్యాటింగ్‌లో చెలరేగిన భారత్.. బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో లయ తప్పింది. అనవసర తప్పిదాలతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఎక్స్‌ట్రా పరుగులు ఇవ్వడంలో భారత్ పేసర్లు ఒకరికొకరు పోటీ పడ్డారు.

13 వైడ్లు వేసిన బుమ్రా..

13 వైడ్లు వేసిన బుమ్రా..

ఐదు టీ20ల సిరీస్‌లో భారత పేసర్ బుమ్రా అదరగొట్టాడు. ఓటమి అంచున చేరిన మ్యాచ్‌లను కూడా అద్భుత బంతులతో భారత్‌వైపు తిప్పాడు. గాయం నుంచి కోలుకొని రీ ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్.. అతి తక్కువ సమయంలోనే లయ అందుకున్నాడు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్‌కు సింహ స్వప్పంలా మారాడు. ఎంతలా అంటే బుమ్రా బౌలింగ్ హిట్ చేయడం చాలా కష్టమని ఆటగాళ్లు బహిరంగంగా ప్రకటించేంత.

ఇక ఐదు టీ20లో నాలుగు ఓవర్లు వేసి కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టిన ఈ యార్కర్ల కింగ్.. ఒక ఓవర్ మెయిడిన్ కూడా చేశాడు.

అలాంటి బుమ్రా తొలి వన్డేలో దారుణంగా విఫలమయ్యాడు. పరుగులు నియంత్రించినప్పటికీ 13 వైడ్లు వేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. బహుశా అతడి కెరీర్‌లో ఇన్ని వైడ్లు వేయడం ఇదే తొలిసారి అనుకుంటా. ఈ మ్యాచ్‌లో మొత్తం 10 ఓవర్లు వేసిన బుమ్రా 53 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయలేకపోయాడు. ఇందులో ఒక మెయిడిన్ ఓవర్ ఉండటం విశేషం.

 షమీ 7 వైడ్లు..

షమీ 7 వైడ్లు..

తానేమి తక్కువా అన్నట్లు మరో స్టార్ పేసర్ మహ్మద్ షమీ 6 వైడ్లు వేశాడు. మూడో టీ20లో 6 బంతుల్లో 9 పరుగులు కొట్టనివ్వకుండా అద్భుతంగా బౌలింగ్ చేసి సూపర్ ఓవర్‌కు దారితీసేలా చేసిన షమీ..ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఏకంగా 8 ఫోర్లు ఇచ్చాడు. 9.1 ఓవర్లు వేసిన షమీ 63 పరుగులు సమర్పించుకొని ఒక వికెట్ తీశాడు.

ఓటమి బాధలో ఉన్న భారత్‌కు మరోషాక్

ఠాకుర్ 2 వైడ్లు.. ఒక నోబాల్..

ఠాకుర్ 2 వైడ్లు.. ఒక నోబాల్..

ఇక మరో పేసర్ శార్ధుల్ ఠాకుర్ 2 వైడ్లు వేసినప్పటికీ దారుణంగా పరుగులిచ్చుకున్నాడు. నాలుగో టీ20లో అద్భుతంగా బౌలింగ్ చేసిన అతను ఈ మ్యాచ్‌లో 9 ఓవర్లు వేసి 80 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీశాడు. ఇక ఒక నోబాల్ కూడా వేశాడు. ఇక ఠాకుర్ బౌలింగ్‌లో కివీస్ బ్యాట్స్‌మన్ 6 ఫోర్లు, 4 సిక్సర్లతో బౌండరీల మోత మోగించారు. ఇక జడేజా, కుల్దీప్ చెరొక వైడ్ వేశారు.

కేవలం వైడ్ల రూపంలోనే 24 పరుగులు న్యూజిలాండ్‌కు రావడం గమనార్హం. భారత్ ఓటమికి ఇదొక కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక న్యూజిలాండ్ బౌలర్లు కూడా 19 వైడ్లు వేశారు. అత్యధికంగా బెన్నెట్ 6 వైడ్లు విసిరాడు. అయితే ఇంతగా వైడ్లు వేయడానికి మంచుకురువడమే కారణమని నిపుణులు అంటున్నారు.

అందుకే అంబటి రాయుడిపై వేటు.. చాలా బాధపడ్డా : ఎమ్మెస్కే

ఇదే తొలిసారి కాదు..

ఇదే తొలిసారి కాదు..

ఇక భారత బౌలర్లు ఇలా వైడ్లు విసరడం ఇదే తొలిసారేం కాదు. 2007లో చెన్నై వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 25, అదే ఏడాది ముంబైలో ఆస్ట్రేలియాపై 26 వైడ్లు విసిరారు. 2004లో ఒవల్‌ వేదికగా ఇంగ్లండ్‌పై 28, 1999 బ్రిస్టల్‌లో కెన్యాపై 31 వైడ్లు వేసారు.

రాస్ టేలర్ సూపర్ సెంచరీ..

రాస్ టేలర్ సూపర్ సెంచరీ..

ఇక ఈ మ్యాచ్‌లో రాస్ టేలర్(109 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగడంతో న్యూజిలాండ్ 4 వికెట్లతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయాస్ అయ్యర్ (107 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌) కెరీర్‌లో తొలి సెంచరీ‌తో సాధించగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (51; 63 బంతుల్లో 6 ఫోర్లు), లోకేష్ రాహుల్ (88 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరిసారు. కివీస్ బౌలర్లలో టీమ్ సౌథీ రెండు వికెట్లు తీయగా.. గ్రాండ్ హోమ్, ఇష్ సోదీ చెరొక వికెట్ తీశారు.

పానీపూరి అమ్మినోడు.. పాక్‌ను పాతరేశాడు

Story first published: Wednesday, February 5, 2020, 21:47 [IST]
Other articles published on Feb 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X