Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓటమి బాధలో ఉన్న భారత్‌కు మరోషాక్

Hamilton ODI: India fined for slow-over rate for 3rd successive time

హమిల్టన్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమి బాధలో ఉన్న కోహ్లీసేనకు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది.

స్లో ఓవర్ రేట్ కారణంగా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 80 శాంత కోత విధించింది. నిర్ణీత సమయానికి భారత్ నాలుగు ఓవర్లు తక్కువ వేసినట్లు ఫీల్డ్ అంపైర్లు శాన్ హైగ్, లాంగ్టన్ రుసెర్, థర్డ్ అంపైర్ బ్రూస్ ఆక్సెన్‌ఫోర్డ్, ఫోర్త్ అంపైర్ క్రిస్ బ్రౌన్ కోహ్లీసేనపై అభియోగాలు నమోదు చేయడంతో విచారించిన మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ మ్యాచ్ ఫీజు కోత విధిస్తూ చర్యలు తీసుకున్నారు. అయితే కెప్టెన్‌ విరాట్ కోహ్లీ తమ తప్పిదాన్ని అంగీకరించడంతో తదుపరి విచారణ, వాదనలు ఉండవని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇక ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఆర్టికల్‌ 2.22 ప్రకారం ప్రతి ఓవర్‌ నిర్ణీత సమయంలో పూర్తి కావాలి. లేనిపక్షంలో ఒక ఓవర్‌కు 20 శాతం చొప్పున ఆటగాళ్లు, ఆ జట్టు సిబ్బంది మ్యాచ్‌ ఫీజులో కోత విధిస్తారనే విషయం తెలిసిందే.

ఇక భారత్‌ ఆటగాళ్లు మ్యాచ్ ఫీజు కోతకు గురవ్వడం వరుసగా ఇది మూడోసారి. నాలుగో టీ20లో, చివరి టీ20లో నిర్ణీత సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేయడంతో 20 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించారు. వెస్ట్‌ప్యాక్‌ స్టేడియం వేదికగా జరిగిన నాలుగో టీ20లోనూ టీమిండియా రెండు ఓవర్లు ఆలస్యంగా మ్యాచ్‌ను ముగించింది. దీంతో భారత ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 40 శాతం పెనాల్టీ విధించింది.

ఇక తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయాస్ అయ్యర్ (107 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌) కెరీర్‌లో తొలి సెంచరీ‌తో సాధించగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (51; 63 బంతుల్లో 6 ఫోర్లు), లోకేష్ రాహుల్ (88 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరిసారు. కివీస్ బౌలర్లలో టీమ్ సౌథీ రెండు వికెట్లు తీయగా.. గ్రాండ్ హోమ్, ఇష్ సోదీ చెరొక వికెట్ తీశారు.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. 48.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసి విజయాన్నందుకుంది. టేలర్ అజేయ సెంచరీకి తోడు నికోలస్(78), స్టాండ్ కెప్టెన్ టామ్ లాథమ్(69) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ రెండు వికెట్లు తీయగా.. షమీ, ఠాకుర్ చెరొక వికెట్ తీశారు.

Story first published: Wednesday, February 5, 2020, 20:10 [IST]
Other articles published on Feb 5, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+