న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వాళ్లిద్ద‌రూ దేశవాళీ క్రికెట్‌లో ఎందుకు ఆడటం లేదు?: సన్నీ ఫైర్

Why aren’t MS Dhoni, Shikhar Dhawan playing domestic cricket? Asks Sunil Gavaskar

హైదరాబాద్: కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పర్యటనకి దూరమై ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర విమర్శలు గుప్పించాడు.

ఆసీస్ గడ్డపై మరో అరుదైన ఘనతకు 8 పరుగుల దూరంలో కోహ్లీఆసీస్ గడ్డపై మరో అరుదైన ఘనతకు 8 పరుగుల దూరంలో కోహ్లీ

ఈ ఏడాది ఇంగ్లాండ్ పర్యటనలో విఫలమైన ధోని ఆ తర్వాత జరిగిన ఆసియా కప్, వెస్టిండీస్‌ జట్లతో జరిగిన వన్డే సిరిస్‌ల్లో సైతం చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయాడు. దీంతో సొంతగడ్డపై వెస్టిండీస్‌, ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌ల నుంచి ధోనీని తప్పించిన సెలక్టర్లు అతని స్థానంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు అవకాశమిచ్చారు.

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా గురువారం నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. సుదీర్ఘ ఫార్మాట్‌కు ధోని వీడ్కోలు పలకడం, పేలవ ఫామ్ కారణంగా వేటు పడటంతో శిఖర్ ధావన్‌లు ఈ సిరీస్‌కి దూరమయ్యారు. అయితే, ఈ ఇద్దరినీ దేశవాళీ క్రికెట్‌లో బీసీసీఐ లేదా సెలక్టర్లు ఎందుకు ఆడించడం లేదు? అని గవాస్కర్ ప్రశ్నించాడు.

ఆ తర్వాత న్యూజిలాండ్‌తో సిరీస్, వన్డే వరల్డ్‌కప్

ఆ తర్వాత న్యూజిలాండ్‌తో సిరీస్, వన్డే వరల్డ్‌కప్

ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ముగిసిన తర్వాత మూడు వన్డేల సిరిస్... ఆ తర్వాత న్యూజిలాండ్‌తో సిరీస్, వన్డే వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో ఫామ్ అందుకునేందుకు ఈ ఇద్దరు క్రికెటర్లనీ దేశవాళీ టోర్నీల్లో సెలక్టర్లు ఆడించాలని గవాస్కర్ సూచించాడు. ఈ సందర్భంగా సునీల్ గవాస్కర్ మాట్లాడాడు.

ధోని తన ఆఖరి మ్యాచ్‌ని అక్టోబరులో ఆడాడు

ధోని తన ఆఖరి మ్యాచ్‌ని అక్టోబరులో ఆడాడు

"ధోని ఇటీవల వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లు ఆడలేదు. ఇక టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించి ఉండటంతో వాటిని ఆడే అవకాశం లేదు. దీనిని బట్టి చూస్తే అతను ఆఖరి మ్యాచ్ అక్టోబరులో ఆడాడు. ఇక తర్వాత మ్యాచ్ వచ్చే ఏడాది జనవరిలో ఆడనున్నాడు. ఈ మధ్యలో చాలా విరామ సమయం ఉంది" అని గవాస్కర్ అన్నాడు.

 న్యూజిలాండ్‌‌పైనా ఫెయిలైతే?

న్యూజిలాండ్‌‌పైనా ఫెయిలైతే?

"ఒకవేళ ధోని ఆస్ట్రేలియా‌తో వన్డే సిరీస్‌.. ఆ తర్వాత న్యూజిలాండ్‌‌పైనా ఫెయిలైతే? వన్డే ప్రపంచకప్‌‌‌కి అతడ్ని ఎంపిక చేయగలరా? ఒకవేళ సాహసించే ధోనిని ఎంపిక చేస్తే? తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ధోనీ కూడా పెరుగుతున్న వయసు దృష్ట్యా.. విరామ సమయాల్లో ఖాళీగా ఉండకుండా దేశవాళీ క్రికెట్‌లో ఆడటం ఉత్తమం. అలా అయితేనే ఫామ్‌ అందుకుని, మంచి ఇన్నింగ్స్‌లు ఆడగలడు. బీసీసీఐ కూడా ఆ దిశగా ఆలోచించి ధోనితో పాటు శిఖర్ ధావన్‌లు ఎందుకు దేశవాళీ క్రికెట్ ఆడటం లేదో ప్రశ్నించాలి" అని గవాస్కర్ సూచించాడు.

Story first published: Tuesday, December 4, 2018, 18:39 [IST]
Other articles published on Dec 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X