న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్ కాదట: వన్డేల్లో తొలి డబుల్‌ సెంచరీ చేసింది ఎవరో తెలుసా?

By Nageshwara Rao
Who is the first cricketer to score a double century in an ODI?

హైదరాబాద్: ఫకార్‌ జమాన్‌.. ఒక్క రోజులో ఇంటర్నెట్ సెన్షేషన్ అయ్యాడు. అందుకు కారణం. బులవాయాలో జింబాబ్వేతో జరిగిన నాలుగోవన్డేలో ఈ పాకిస్తాన్‌ ఓపెనర్‌ 156 బంతుల్లో 24 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో డబుల్‌ సెంచరీ(210 నాటౌట్‌) సాధించాడు. దీంతో పాక్‌ తరుపున తొలి డబుల్ సెంచరీ నమోదు చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

దీంతో మరోసారి డబుల్‌ సెంచరీ రికార్డులు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే భారత్‌ నుంచి ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (209, 264, 208) మూడు డబుల్‌ సెంచరీలు సాధించగా.. మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌(219), సచిన్‌ టెండూల్కర్‌ (200)లు సైతం డబుల్‌ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

సచిన్‌ కన్నా ముందే మరొకరు డబుల్ సెంచరీ

సచిన్‌ కన్నా ముందే మరొకరు డబుల్ సెంచరీ

2010లో ఇండోర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. దీంతో వన్డేల్లో తొలి డబుల్‌ సెంచరీ చేసిందీ ఎవరు? అని అడిగితే క్రికెట్ అభిమానుల నోట వెంట ఠక్కువ వచ్చే సమాధానం సచిన్ రమేశ్ టెండూల్కర్. కానీ వన్డేల్లో సచిన్‌ కన్నా ముందే మరొకరు డబుల్ సాధించారు. అది కూడా 20 ఏళ్ల క్రిందటే.

ఆస్ట్రేలియాకు చెందిన మహిళా క్రికెటర్‌ బెలిండా క్లార్క్‌

ఆస్ట్రేలియాకు చెందిన మహిళా క్రికెటర్‌ బెలిండా క్లార్క్‌

ఈ డబుల్ సెంచరీ రికార్డుని నమోదు చేసింది ఓ మహిళా క్రికెటర్ కావడంతో ఆమె పేరు పాపులర్ కాలేదు. ఆమె ఎవరో కాదు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్‌ బెలిండా క్లార్క్‌. 1997 మహిళా ప్రపంచకప్‌లో భాగంగా డెన్మార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో బెలిండా 229 పరుగులు చేశారు.. 155 బంతుల్లో 22 ఫోర్లతో ఆమె నాటౌట్‌గా నిలిచి ఈ ఘనత సాధించారు. అది మొత్తంగా వన్డేల్లో నమోదైన తొలి డబుల్ సెంచరీ. ఈ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్‌ కూడా లేకపోవడం గమనార్హం.

ఐసీసీ గుర్తింపు

ఐసీసీ గుర్తింపు

మహిళల విభాగంలో తొలి డబుల్ సెంచరీగా ఐసీసీ గుర్తించింది. ఇక, పురుషుల వన్డేల్లో తొలి డబుల్‌ సాధించింది మాత్రం సచిన్‌ టెండూల్కరే. ఆ తర్వాత వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, క్రిస్‌గేల్, మార్టిన్ గప్టిల్, ఫకార్ జమాన్‌లు డబుల్ సెంచరీలు సాధించారు. వీరిలో రోహిత్ శర్మ మూడు సార్లు డబుల్ సెంచరీ సాధించడం విశేషం.

వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించిన క్రికెటర్లు వీరే:

వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించిన క్రికెటర్లు వీరే:

1. బెలిండా క్లార్క్ 229 నాటౌట్‌ - (డెనార్మ్‌పై, 1997)

2. సచిన్‌ టెండూల్కర్‌ 200 నాటౌట్‌ - ( 2010లో దక్షిణాఫ్రికాపై)

3. వీరేంద్ర సెహ్వాగ్‌ 219 - (2011లో వెస్టిండీస్‌)

4. రోహిత్‌ శర్మ 209 - (2013లో ఆస్ట్రేలియా)

5. రోహిత్‌ శర్మ 264 - (2014లో శ్రీలంకపై)

6. క్రిస్‌ గేల్‌ 215 - (2015 వరల్డ్‌కప్‌, జింబాబ్వేపై)

7. మార్టిన్‌ గప్టిల్‌ 237 నాటౌట్‌ - (2015, వెస్టిండీస్‌)

8. రోహిత్‌ శర్మ 208 - ( 2017, శ్రీలంక)

9. ఫకార్ జమాన్ 210 నాటౌట్ - (2018, జింబాబ్వే)

Story first published: Saturday, July 21, 2018, 13:25 [IST]
Other articles published on Jul 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X