న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

shashank singh : ఎవరీ సన్‌రైజర్స్ సంచలనం.. శశాంక్ గురించి తెలుసుకోవాల్సిన మూడు విషయాలు

Who Is Shashank Singh: 3 Things You Need To Know About This SRH Sensation

గుజరాత్ టైటాన్స్‌ వర్సెస్ సన్ రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న శశాంక్ సింగ్ 6బంతుల్లో 25పరుగులు చేసి హాట్ టాపిక్‌గా మారాడు. 1ఫోర్, 3సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఫెర్గూసన్ వేసిన చివరి ఓవర్లో చివరి మూడు బంతులను సిక్సర్లుగా మలిచి హైదరాబాద్‌కు భారీ స్కోరు అందించాడు.

ఇక ఈ మ్యాచ్‌లో అతని ప్రదర్శనకు క్రికెట్ ప్రముఖులు, అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. ఇంతకు ఈ ప్లేయర్ ఎవరనీ చర్చించుకుంటున్నారు. శశాంక్ సింగ్ గురించి మూడు ముఖ్యమైన విషయాలు ఏంటంటే. శశాంక్ సింగ్ 1991 జనవరి 21న జన్మించాడు. అతని కుటుంబ స్వస్థలం మహారాష్ట్రలోని బిలాయ్ ప్రాంతం అయినప్పటికీ వాళ్లు ముంబైకి వచ్చేశారు. శశాంక్ సింగ్ ముంబైలోనే పుట్టి పెరిగాడు. అతనికి ప్రస్తుతం 30ఏళ్లు.

1. ప్రస్తుతం శశాంక్ సింగ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఛత్తీస్‌గఢ్ జట్టు తరఫున ఆడుతున్నాడు. 2015-16విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా లిస్ట్ A క్రికెట్లో ముంబై తరఫున అరంగేట్రం చేశాడు. 2019-20రంజీ ట్రోఫీలో ఛత్తీస్‌గఢ్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసి కొనసాగుతున్నాడు.

2. 2017లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్) జట్టు అతన్ని 10లక్షలకు కొనుక్కుంది. తర్వాతి సీజన్ల వేలంలో రాజస్థాన్ రాయల్స్ అతన్ని కొనుగోలు చేసింది. అయినప్పటికీ అతనికి పెద్ద అవకాశాలు రాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎల్ మెగా వేలంలో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని బేస్ ప్రైస్ 20లక్షలకే కొనుక్కుంది.

3. శశాంక్ సింగ్ ఐపీఎల్లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడినప్పటికీ అతనికి ఒక్య మ్యాచ్‌లోనూ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అతను ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. కాగా తాజాగా జరుగుతున్న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనే అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని అతను అందిపుచ్చుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో చివరి రెండు ఓవర్లు ఉండగా బరిలో దిగిన శశాంక్ అల్జారీ జోసెఫ్ వేసిన బౌలింగ్లో తన తొలి బంతిని ఎదుర్కొన్నాడు. ఆ బంతిని కవర్ దిశగా ఫోర్ బాది బౌండరీతో తన బ్యాటింగ్ ప్రస్థానాన్ని మొదలెట్టాడు. ఇక చివరి ఓవర్లో ఫెర్గూసన్ బౌలింగ్ వేయగా.. చివరి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు కొట్టాడు. ఆ ఓవర్లో మొత్తం 25పరుగులు రావడంతో సన్ రైజర్స్ 195పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.

Story first published: Wednesday, April 27, 2022, 22:10 [IST]
Other articles published on Apr 27, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X