న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎవ‌రీ మ‌యాంక్ అగ‌ర్వాల్‌? ఒక్క వ‌న్డే కూడా ఆడ‌న‌ప్ప‌టికీ గోల్డెన్ ఛాన్స్!

ICC Cricket World Cup 2019 : Mayank Agarwal To Join Team India As Vijay Shankar Got Injured
Who is Mayank Agarwal, who make his debut in World Cup Tournament?

న్యూఢిల్లీ: భార‌త క్రికెట్ ప్రపంచంలో తాజా సంచ‌ల‌నంగా మారిన పేరు మ‌యాంక్ అగ‌ర్వాల్‌. ఇంగ్లండ్‌లో ప్ర‌పంచ‌కప్ టోర్న‌మెంట్‌లో ఆడుతున్న భార‌త క్రికెట్ జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్న క్రికెట‌ర్‌. మ‌డ‌మ‌ల్లో గాయం కార‌ణంగా ఆల్ రౌండ‌ర్ విజ‌య్ శంక‌ర్ టోర్నీ మొత్తానికీ దూరం కావ‌డంతో.. అత‌ని స్థానంలో మ‌యాంక్ అగ‌ర్వాల్‌ను తీసుకుంది. జ‌ట్టులో మార్పులు చేయ‌డానికి అవ‌కాశం ఇవ్వాల‌ని, విజ‌య్ శంక‌ర్ స్థానంలో మ‌యాంక్‌ను ఆడ‌టానికి అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు ప్ర‌తిపాద‌న‌ల‌ను పంపించింది. దీనిపై అనుమ‌తి రావాల్సి ఉంది.

ఐపీఎల్‌తో వెలుగులోకి..

ఐపీఎల్‌తో వెలుగులోకి..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ మ్యాచుల‌తో ఒక్క‌సారిగా వెలుగులోకి వ‌చ్చాడు మ‌యాంక్. ఐపీఎల్ సీజ‌న్ ఆరంభంలో కోచి ట‌స్క‌ర్స్ కేర‌ళ జ‌ట్టులో ఎంపిక అయ్యాడు. అదే అత‌నికి తొలి ఐపీఎల్ సీజ‌న్‌. అనంత‌రం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ఢిల్లీ డేర్ డెవిల్స్‌, రైజింగ్ పూణె సూప‌ర్ జెయింట్ టీమ్‌ల‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు. ప్ర‌స్తుతం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జ‌ట్టులో కొన‌సాగుతున్నాడు. 2018 సీజ‌న్ సంద‌ర్భంగా మ‌యాంక్ అగ‌ర్వాల్‌ను కొనుగోలు చేసింది కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంఛైజీ. 2019 సీజ‌న్‌లోనూ అదే జ‌ట్టుకు ఆడాడు. ప్ర‌స్తుతం అందులోనే కొన‌సాగుతున్నాడు.

టెస్టుల్లో టీమిండియా త‌ర‌ఫున..

టెస్టుల్లో టీమిండియా త‌ర‌ఫున..

ఆస్ట్రేలియాతో సిరీస్ సంద‌ర్భంగా గ‌త ఏడాదే మ‌యాంక్ అగ‌ర్వాల్ టీమిండియా టెస్టు జ‌ట్టులో స్థానం సంపాదించాడు. రెండు మ్యాచుల‌ను ఆడాడు. రెండు మ్యాచుల్లో మొత్తం మూడు ఇన్నింగుల్లో ఆడిన మ‌యాంక్ అగ‌ర్వాల్ 195 ప‌రుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ‌సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోరు 77. ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌లు 50, లిస్ట్ ఎ మ్యాచ్‌లు 75 ఆడాడు. 2010 నుంచి మొన్న‌టి ఐపీఎల్ సీజ‌న్ ముగిసే వ‌రకూ 134 టీ20 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. టీ20ల్లో అత‌ని అత్య‌ధిక స్కోరు 111. 18 అర్ధ‌సెంచ‌రీలు ఉన్నాయి. 2939 ప‌రుగులు చేశాడు.

ఒక్క వ‌న్డే కూడా ఆడ‌న‌ప్ప‌టికీ.

ఒక్క వ‌న్డే కూడా ఆడ‌న‌ప్ప‌టికీ.

నిజానికి- మ‌యాంక్ అగ‌ర్వాల్ టెస్ట్ మ్యాచ్‌ల్లో ఆడాడే గానీ.. వ‌న్డేల్లో ఇంత వ‌రకూ అత‌ను అడుగు పెట్ట‌లేదు. క‌ర్ణాట‌క జ‌ట్టు త‌ర‌ఫున రంజీల్లో ఆడుతున్నాడు. అంత‌ర్జాతీయ స్థాయిలో 50 ఓవ‌ర్ల మ్యాచ్‌ల‌ను ఆడిన అనుభ‌వం కూడా త‌క్కువే. అయిన‌ప్పటికీ అత‌నిపై విశ్వాసం ఉంచింది టీమ్ మేనేజ్‌మెంట్‌. విస్తారంగా టీ20 మ్యాచ్‌ల‌ల్లో ఆడిన అనుభ‌వాన్ని దృష్టిలో ఉంచుకుని అత‌ణ్ని ఎంపిక చేశారు సెలెక్ట‌ర్లు. మ‌యాంక్‌కు ద‌క్కిన అరుదైన అవ‌కాశమే ఇది. స్టాండ్ బైల్లో కూడా అత‌ని పేరు లేన‌ప్ప‌టికీ.. మ‌యాంక్‌ను జ‌ట్టులోకి తీసుకోవడాన్ని బ‌ట్టి చూస్తోంటే.. అత‌నికి ఇచ్చిన ప్రాధాన్య‌త ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

Story first published: Monday, July 1, 2019, 15:09 [IST]
Other articles published on Jul 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X