న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిక్స్ లేకుండా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసి ఆటగాళ్లు ఎవరో తెలుసా?

Cricketers Most Number Of Career Runs Without Hitting A Six | Oneindia Telugu
Who has scored the most runs in ODIs without ever hitting a six?

హైదరాబాద్: క్రికెట్ ఒక జెంటెల్మెన్ గేమ్. ఈ గేమ్‌లో బ్యాట్స్‌మెన్లు ప్రత్యర్ధి జట్ల బౌలర్లను ఊచకోత కోస్తుంటారు. మరి బౌలర్లు ఏమన్నా తక్కువ తిన్నారా? బౌలర్లు సైతం బుల్లెట్ లాంటి బౌలర్లతో బ్యాట్స్ మెన్‌ను గడగడలాడిస్తారు. క్రికెట్ అంటేనే ఫోర్లతో పాటు సిక్సులు కూడా ఉంటాయి.

అలాంటి క్రికెట్‌లో సిక్స్ లేకుండా వెయ్యికిపైగా పరుగులు చేసిన ఆటగాళ్లు ఎవరైనా ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినవస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో సిక్స్ లేకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు మన భారత్‌కు చెందిన ఆటగాడే కావడం విశేషం.

ఒక్క సిక్స్ కూడా లేకుండా 1858 పరుగులు చేసిన మనోజ్

ఒక్క సిక్స్ కూడా లేకుండా 1858 పరుగులు చేసిన మనోజ్

ఆ ఆటగాడు మరెవరో కాదు మనోజ్ ప్రభాకర్. అంతర్జాతీయ క్రికెట్‌లో మనోజ్ ప్రభాకర్ ఒక్క సిక్స్ కూడా లేకుండా 1858 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో ఆ తర్వాతి స్థానాల్లో జింబాబ్వేకు చెందిన డయాన్ ఎబ్రహీం (1443) పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

మూడో స్థానంలో జెఫ్ బాయ్‌కాట్

మూడో స్థానంలో జెఫ్ బాయ్‌కాట్

ఇంగ్లాండ్‌కు చెందిన జెఫ్ బాయ్‌కాట్ (1082) పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. వీరంతా కూడా మాజీ క్రికెటర్లు కావడం విశేషం. నిజానికి, ఈ జాబితాలో చోటు దక్కించుకోవాలని ఏ క్రికెటర్ కూడా ఆశించడు. అయితే, ఆప్ఘనిస్థాన్‌కు చెందిన హష్మతుల్లా షాహిది ఈ మధ్య కాలంలో వన్డేల్లో సిక్స్ లేకుండా 675 పరుగులు చేయడం విశేషం.

టెస్టుల్లో ఈ జాబితాలో జొనాథాన్ ట్రోట్

టెస్టుల్లో ఈ జాబితాలో జొనాథాన్ ట్రోట్

ఇక, అదే టెస్టు క్రికెట్ విషయానికి వస్తే ఈ రికార్డు ఇంగ్లాండ్ క్రికెటర్ జొనాథాన్ ట్రోట్(3835) పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. జనోథాన్ ట్రోట్ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్ కూడా లేకపోవడం విశేషం. ఈ జాబితాలో ఆ తర్వాతి స్థానాల్లో ఇండియాకు చెందిన విజయ్ మంజ్రేకర్(3208) పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

టీ20ల్లో కెనడాకు చెందిన మాజీ కెప్టెన్, వికెట్ కీపర్

టీ20ల్లో కెనడాకు చెందిన మాజీ కెప్టెన్, వికెట్ కీపర్

న్యూజిలాండ్‌కు చెందిన్ గ్లెన్ టర్నర్(2991) పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. వీరంతా కూడా తమ తమ ఇన్నింగ్స్‌ల్లో ఒక్క సిక్స్ కూడా బాదకపోవడం విశేషం. ఇక, టీ20ల్లో కెనడాకు చెందిన మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ 284 పరుగులతో ఆషీస్ బాగాయి అగ్రస్థానంలో ఉన్నాడు.

Story first published: Thursday, November 22, 2018, 13:55 [IST]
Other articles published on Nov 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X