న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భళే దోస్తీ.. సచిన్‌కు పాదాభివందనం చేసిన వినోద్ కాంబ్లీ(వీడియో)

When Vinod Kambli touched Sachin Tendulkar’s feet

హైదరాబాద్: ఒకే చోట ఓనమాలు దిద్దిన ఈ క్రికెటర్ల మధ్య కుదిరినంతగా దోస్తీ మరెవరి మధ్య ఉండదేమో.. ఒకే పాఠశాల, ఒకే రాష్ట్ర జట్ల తరఫున ఆడడంతో పాటు దేశానికి కూడా ప్రాతినిధ్యం వహించారు. అయితే వీరిద్దరి మధ్య కొన్నాళ్ల‌పాటు కాస్త దూరం పెరిగినా ఇప్పుడు మళ్లీ ఒక్కటయ్యారు. ముంబై టీ20 లీగ్‌ సందర్భంగా ఈ ఫ్రెండ్స్‌ మధ్య చోటు చేసుకున్న ఓ సరదా సన్నివేశం ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కాంబ్లీ కోచ్‌గా వ్యవహరిస్తున్న శివాజీ పార్క్‌ లయన్స్‌ జట్టు ట్రయంప్‌ నైట్స్‌ చేతిలో ఓడింది. అవార్డుల కార్యక్రమంలో భాగంగా వేదికపై సచిన్‌, గవాస్కర్‌ ఉన్నారు. రన్నరప్‌ మెడల్‌ను కాంబ్లీకి గవాస్కర్‌ అందించాల్సి ఉండగా.. ఎవరూ ఊహించని విధంగా కాంబ్లీ పక్కనే ఉన్న తన స్నేహితుడు సచిన్‌ కాళ్లకు మొక్కడంతో అంతా అవాక్కయ్యారు.

వెంటనే తేరుకున్న సచిన్‌.. కాంబ్లీని లేపి గట్టిగా హత్తుకోవడంతో అక్కడ అంతా నవ్వులు విరిశాయి. సచిన్ క్రికెట్ పైనే దృష్టి పెట్టి స్టార్ స్థాయిలో మారిపోయాడు. కానీ, వినోద్ కాంబ్లీ వ్యక్తిగత కారణాల వల్ల అంతగా పరిణతి చెందలేకపోయాడు. అభిమానులు ఈ ఫొటోను షేర్ చేస్తూ.. వారిద్దరి మధ్య స్నేహాన్ని కొనియాడుతున్నారు.

ట్వీట్ల రూపంలో వారు పెడుతున్న కామెంట్లు ఇలా ఉన్నాయి. 'ముంబై టీ20 లీగ్‌లోనే ఇది ఒక బెస్ట్ మూమెంట్', 'పాత మిత్రులు కలిశారు', 'ఈ బంధం ప్రేమతో కూడుకున్నది', 'జన్మజన్మల బంధమిది', 'చిన్ననాటి మిత్రులు కలిశారు', 'ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైన సచిన్ స్నేహితుడ్నిగుండెకు హత్తుకున్నారు', 'వాంఖడే వేదికగా ఇండియా క్రికెట్ దిగ్గజం ముంబై క్రికెట్ స్టార్ ఒక్కటైయ్యారు'.

Story first published: Friday, March 23, 2018, 15:32 [IST]
Other articles published on Mar 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X