దాదాగిరి చూపించిన గంగూలీ, మైకేల్ క్లార్క్ బయటపెట్టిన నిజం

Posted By:
When Sourav Ganguly Trolled Ricky Ponting During a Toss

హైదరాబాద్: ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా మాజీ కెప్టెన్‌కు వివాదాలు ఎక్కువగానే నడిచాయి. ఈ విషయాలన్ని కొంచెం కొంచెంగా అయినా బయటకి వస్తూనే ఉన్నాయి. అప్పట్లో స్టీవ్ వాను టాస్ కోసం నిరీక్షించేలా చేశాడు. తర్వాత గ్రెగ్ చాపెల్ కోచ్‌గా ఉన్న సమయంలో పెద్ద గొడవే జరిగింది. ఇలాంటిదే తాజాగా మరో ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్, గంగూలీ మధ్య ఒకప్పుడు జరిగిన ఓ ఘటనను మరో మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ బయటపెట్టాడు.

అంత తీవ్రతరమైనది కాదు.. కేవలం సరదాగా జరిగిన ఘటన మాత్రమే. టాస్ విషయంలో పాంటింగ్‌ను గంగూలీ ఆటపట్టించాడట. క్లార్క్ ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ..

 టాస్‌కు వెళ్లిన

టాస్‌కు వెళ్లిన

'ఆ మ్యాచ్ ఎప్పుడు జరిగిందన్నదని కరెక్ట్‌గా గుర్తు లేదు. కానీ, ఇండియాలోనే జరిగింది. అయితే టాస్‌కు వెళ్లిన సమయంలో పాంటింగ్ కాయిన్‌ను గాల్లోకి ఎగరేయగా.. గంగూలీ ఒకేసారి హెడ్-టెయిల్ అని మెరుపు వేగంతో చెప్పాడు. పాంటింగ్‌కు అది అర్థమయ్యేలోపు కాయిన్ కింద పడటం, గంగూలీ దానిని తీసుకొని మేం బ్యాటింగ్ చేస్తామని చెప్పి వెళ్లడం జరిగిపోయింది' అని పేర్కొన్నాడు.

ఏం జరిగిందో అర్థం

ఏం జరిగిందో అర్థం

పాపం.. అప్పుడు.. ఏం జరిగిందో అర్థం కాక పాంటింగ్ డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చి ఈ విషయాన్ని మాతో చెప్పాడు అని క్లార్క్ చెప్పాడు. ఈ విషయాన్ని ప్రముఖ స్పోర్ట్స్ ఎడిటర్ బోరియా మజుందార్ తన లేటెస్ట్ బుక్ 'ఎలెవన్ గాడ్స్ అండ్ ఎ బిలియన్ ఇండియన్స్' అనే బుక్‌లో ప్రస్తావించాడు. పాంటింగ్‌తో గంగూలీ ఎలా తన దాదాగిరి చూపించాడో చెప్పడానికి క్లార్క్ ఈ ఘటనను సరదాగా వివరించాడు.

ఓ పొరపాటును ఎత్తి

అయితే ఇక్కడే అభిమానులు ఓ పొరపాటును ఎత్తి చూపారు. మ్యాచ్ ఇండియాలో అయితే టాస్ గంగూలీ వేస్తాడుగానీ.. పాంటింగ్ ఎందుకు వేస్తాడు.. ఇదంతా క్లార్క్ చెప్పిన కట్టు కథ అంటూ ట్విట్టర్‌లో కొత్త చర్చకు తెరలేపారు. ఇదీ నిజమేనంటూ మరికొందరు సమర్థిస్తున్నారు.

అది ఎక్కడ జరిగిందో

అది ఎక్కడ జరిగిందో

మరోవైపు మ్యాచ్ ఎప్పుడు జరిగిందన్నది తనకు సరిగా గుర్తు లేదని చెప్పిన క్లార్క్.. అది ఎక్కడ జరిగిందో కూడా మరచిపోయి ఇండియాలో అని చెప్పి ఉంటాడని మరికొందరు అంటున్నారు. మొత్తానికి అన్ని టీమ్స్‌పై అజమాయిషీ చెలాయించాలని చూసే ఆస్ట్రేలియాకు గంగూలీ మాత్రం ఎప్పుడూ ఇలాగే ప్రవర్తించాడు. సై అంటే సై అనే దాదా.. ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యానికి సవాలు విసిరిన ఇండియన్ కెప్టెన్‌గా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాడు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Monday, April 16, 2018, 16:54 [IST]
Other articles published on Apr 16, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి