న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

198 balls, 0 wickets: చెపాక్‌లో స్పిన్నర్ల ఖాతాలో ఓ చెత్త రికార్డు

When it didnt spin at Chepauk: India, West Indies spinners set unwanted record in 1st ODI

హైదరాబాద్: చెపాక్‌లోని ఎమ్ చిదంబరం స్టేడియం స్పిన్నర్లకు స్వర్గధామం. ఈ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు టైటిల్ విజేతగా నిలవడంలో స్పిన్నర్లదే కీలకపాత్ర. అటు దేశవాళీ క్రికెట్‌లోనూ చెపాక్ స్టేడియంలో ఎప్పుడూ స్పిన్నర్లే తమ హవాని కొనసాగిస్తారు.

అయితే, మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా ఆదివారం భారత్-వెస్టిండిస్‌ జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో స్పిన్నర్లు విఫలమయ్యారు. వికెట్ల తీసేందుకు నానాతంటాలు పడ్డారు. తొలి వన్డేలో ఇరు జట్లలోని స్పిన్నర్లు మొత్తం 33 ఓవర్లు వేసిన ఒక వికెట్ కూడా తీయలేకపోయారు.

T20 World Cup: దక్షిణాఫ్రికా తరుపున ఏబీ డివిలియర్స్, కొత్త కోచ్ బౌచర్ ఇలా!T20 World Cup: దక్షిణాఫ్రికా తరుపున ఏబీ డివిలియర్స్, కొత్త కోచ్ బౌచర్ ఇలా!

ఐదుగురు స్పిన్నర్లతో

ఐదుగురు స్పిన్నర్లతో

ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లతో బరిలోకి దిగింది. మరోవైపు పార్ట్ టైమర్ కేదార్ జాదవ్ అదనం. ఇక, వెస్టిండిస్ సైతం లెగ్ స్పిన్నర్ హెడెన్ వాల్ష్, ఆఫ్ స్పిన్నర్ రోస్టన్ ఛేజ్‌లతో బరిలోకి దిగింది. ఈ ఐదుగురు స్పిన్నర్లు 198 బంతులు సంధించారు.

ఓ చెత్త రికార్డుని తమ ఖాతాలో

ఓ చెత్త రికార్డుని తమ ఖాతాలో

ఈ క్రమంలో ఓ చెత్త రికార్డుని తమ ఖాతాలో వేసుకున్నారు. భారత్‌లో జరిగిన ఒక వన్డే మ్యాచ్‌లో వికెట్ తీయకుండా స్పిన్నర్లు వేసిన అత్యధిక బంతులు ఇవే కావడం విశేషం. వన్డే క్రికెట్‌లో కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే స్పిన్నర్లు 33 ఓవర్లకు పైగా బౌలింగ్ చేసి వికెట్ తీయలేకపోయారు.

వికెట్ లేకుండా 228 బంతులు

వికెట్ లేకుండా 228 బంతులు

వికెట్ తీయకుండా స్పిన్నర్లు విసిరిన బంతుల సంఖ్య 228. 2001/02లో ఢాకా వేదికగా బంగ్లాదేశ్-జింబాబ్వే జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ చెత్త రికార్డు నమోదైంది. ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ఇది కూడా స్పిన్ పిచే కావడం విశేషం. హరారే వేదికగా 2011లో జింబాబ్వే-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన వన్డేలో స్పిన్నర్లు 222 బంతులు వేసి వికెట్ తీయలేకపోయారు.

8 వికెట్ల తేడాతో భారత్ ఓటమి

8 వికెట్ల తేడాతో భారత్ ఓటమి

కాగా, చెన్నైలో జరిగిన తొలి వన్డేలో వెస్టిండిస్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. అనంతరం 288 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

విశాఖపట్నం వేదికగా రెండో వన్డే

విశాఖపట్నం వేదికగా రెండో వన్డే

హెట్‌మెయిర్‌(139; 106 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు), షాయ్‌ హోప్‌(102 నాటౌట్‌; 151 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌)లు సెంచరీలు సాధించారు. హెట్‌మెయిర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు లభించింది. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే బుధవారం విశాఖపట్నం వేదికగా జరగనుంది.

Story first published: Monday, December 16, 2019, 16:19 [IST]
Other articles published on Dec 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X