న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వార్నర్‌పై సందేహాం లేదు, ఈ వేసవి అతడిదే: జస్టిన్ లాంగర్ ప్రశంసల వర్షం

When David Warner bats with a clear mind, he is the most destructive player in the world: Justin Langer

హైదరాబాద్: ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్‌పై హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన యాషెస్ సిరిస్‌లో డేవిడ్ వార్నర్ తన చెత్త ప్రదర్శనతో నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. మొత్తం పది ఇన్నింగ్స్‌ల్లో డేవిడ్ వార్నర్ కేవలం 95 పరుగులకే పరిమితమయ్యాడు.

అయితే, ఆ తర్వాత సొంతగడ్డపై శ్రీలంక, పాకిస్థాన్‌లతో జరిగిన టీ20 సిరిస్‌లో వార్నర్ ఒక్కసారిగా ఫామ్‌ని అందుకున్నాడు. పాక్‌తో జరిగిన మూడు టీ20ల సిరిస్‌లో వార్నర్ చెలరేగడంతో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుని కూడా అందుకున్నాడు. పాక్‌తో టీ20 సిరిస్ ముగియడంతో ఇరు జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభం కానుంది.

సచిన్ సరసన చేరేనా? అడిలైడ్ టెస్టులో నసీమ్ షా, అందరి చూపు అతడివైపే!సచిన్ సరసన చేరేనా? అడిలైడ్ టెస్టులో నసీమ్ షా, అందరి చూపు అతడివైపే!

నవంబర్ 21-25న అడిలైడ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌కి ఇంటర్యూ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ "నేను వేచి ఉండలేకపోతున్నా.. వార్నర్ అద్భుతంగా ఆడతాడు. ఆటను సరళీకృతం చేసినప్పుడు, నిశ్చలంగా ఉండి బంతిని చూసేటప్పుడు, తన మనస్సును స్పష్టంగా ఉంచుకున్నప్పుడు, ప్రపంచంలో వార్నర్ అంతటి విధ్వంసకర ఆటగాడు లేడని మాకు తెలుసు" అని అన్నాడు.

"ఆస్ట్రేలియాలో బ్యాటింగ్‌ను అతడు ఇష్టపడతాడు. అంతేకాదు బ్యాటింగ్ అంటే అతడికి ఇష్టం. మేము గొప్ప వేసవి కోసం ఎదురు చూస్తున్నాము. అతను మా జట్టుకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు, అందుకే యాషెస్ తర్వాత అతను వేసవి మొదటి టెస్టులో ఉంటాడని నాకు ఎటువంటి సందేహం లేదు" అని జస్టిన్ లాంగర్ తెలిపాడు.

భారత్‌లో తొలి డే/నైట్ టెస్ట్: మీరు తెలుసుకోవాల్సిన గణాంకాలు, రికార్డులివే!భారత్‌లో తొలి డే/నైట్ టెస్ట్: మీరు తెలుసుకోవాల్సిన గణాంకాలు, రికార్డులివే!

పాకిస్థాన్ జట్టు గత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడింది. ఆ సిరిస్‌లో డేవిడ్ వార్నర్ యావరేజి 71.20గా ఉంది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన టెస్టులో 144 పరుగులతో చెలరేగిన వార్నర్... సిడ్నీ వేదికగా జరిగిన టెస్టులో లంచ్ విరామానికి ముందు సెంచరీ సాధించాడు.

పాక్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు ఆస్ట్రేలియా జట్టు:
టిమ్ పైన్ (సి), కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, జో బర్న్స్, పాట్ కమ్మిన్స్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుస్‌చాగ్నే, నాథన్ లియాన్, మైఖేల్ నేజర్, జేమ్స్ ప్యాటిన్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్.

Story first published: Tuesday, November 19, 2019, 16:41 [IST]
Other articles published on Nov 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X