న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అలెస్టర్ కుక్ తీసిన ఏకైక వికెట్ టీమిండియా బౌలర్‌దే..!!

When Alastair Cook dismissed Ishant Sharma to take his only international wicket

నాటింగ్‌హామ్: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్.. స్టార్‌ బ్యాట్స్‌మన్‌ అలిస్టర్‌ కుక్‌ తన కెరీర్‌ చివరి మ్యాచ్‌కు ముహూర్తం ప్రకటించిన విషయం తెలిసిందే. టీమిండియాతో జరిగే ఏ ఇతర ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌కు సాధ్యంకాని ఎన్నో రికార్డులు, మరెన్నో అవార్డులు అతని సొంతం. క్రీజులో నిలదొక్కుకుంటే చాలు బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ.. స్కోర్‌ బోర్డు పరిగెత్తించేవాడు. ఇక ఫీల్డింగ్‌లో కూడా చురుగ్గా ఉంటూ స్లిప్‌లో ఎన్నో మరుపురాని క్యాచ్‌లు అందుకున్నాడు.

ఈ లెఫ్ట్ హ్యాండ్‌ బ్యాట్స్‌మన్‌ బౌలింగ్‌ చేయడం చాలా అరుదు. అతను ఆడిన 160 టెస్టుల్లో 26,086 బంతులను ఎదుర్కొని 12254 పరుగుల చేయగా.. కేవలం 18 బంతులే బౌలింగ్‌ చేసి ఒక్క వికెట్‌ సాధించాడు. ఆ ఔట్‌ చేసింది కూడా టీమిండియా బౌలర్‌ ఇషాంత్‌ శర్మనే కావడం విశేషం.

2014లో ఎంఎస్‌ ధోని నేతృత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పుడు కుక్‌ తన తొలి అంతర్జాతీయ వికెట్‌ సాధించాడు. తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా లోయర్ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ భువనేశ్వర్‌-ఇషాంత్‌ శర్మలు ప్రత్యర్థి బౌలర్లకు కొరకరానికొయ్యలా తయారయ్యారు. దీంతో ఈ జోడిని విడదీయడానికి అప్పటి కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ రంగంలోకి దిగాడు.

విభిన్నమైన శైలితో బౌలింగ్‌ చేసిన కుక్‌.. ఊరించే బంతులేసి చివరకు ఇషాంత్‌ను పెవిలియన్‌కు పంపించాడు. అతని బౌలింగ్‌ విధానంతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ నవ్వులు పూయించాడు. అయితే కుక్ టెస్టు కెరీర్ ప్రయాణం ఇలా జరిగింది.. 160 టెస్టులు, 289 ఇన్నింగ్స్‌, 12,254 పరుగులు, 294 అత్యధిక స్కోరు, 44.88 సగటు, 32 సెంచరీలు, 5 డబుల్ సెంచరీలు, 56 హాఫ్ సెంచరీలు, 173 క్యాచ్‌లు ఉన్నాయి.

Story first published: Tuesday, September 4, 2018, 14:21 [IST]
Other articles published on Sep 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X