న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ, ధోనిల నాయకత్వం ఎలా ఉంది?: కొత్త ఆటగాళ్లు ఏం చెప్పారంటే

Dhoni And Virat Kohli Are The Legends In The Team Says New Players
What is it like to play under Virat Kohli, MS Dhoni? Indian players spill the beans

హైదరాబాద్: తమకు ధోని గురువులా చక్కటి సూచనలు చేస్తున్నాడని భారత జట్టులో చోటు దక్కించుకున్న కొత్త ఆటగాళ్లు అంటున్నారు. ప్రస్తుతం రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ఆసియా కప్‌ టోర్నమెంట్ కోసం యూఏఈలో పర్యటిస్తోంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు.

<strong>హై ఓల్టేజ్ మ్యాచ్‌గా భారత్-పాక్ మ్యాచ్: ఒకే టోర్నీలో మూడు సార్లు తలపడేనా?</strong>హై ఓల్టేజ్ మ్యాచ్‌గా భారత్-పాక్ మ్యాచ్: ఒకే టోర్నీలో మూడు సార్లు తలపడేనా?

ఆసియా కప్ టోర్నీ కోసం ప్రకటించిన జట్టులో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సైతం చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియాలోని కొత్త వారికి ధోని చక్కని సలహాలు ఇస్తున్నాడు. దీంతో తాము టీమ్‌లోకి ప్రవేశిస్తున్న సమయంలో ధోని ఉండడం తమ అదృష్టమని యువ ఆటగాళ్లు అంటున్నారు.

కొత్త ఆటగాళ్లకు తగిన సూచనలు

కొత్త ఆటగాళ్లకు తగిన సూచనలు

మరోవైపు కోహ్లీ సైతం కొత్త ఆటగాళ్లను ఎంతగానో ప్రోత్సహిస్తున్నాడు. కొత్త ఆటగాళ్లకు తగిన సూచనలు ఇస్తూ అన్ని ఫార్మాట్లలో ఆటగాళ్లు బాగా రాణించేలా తన వంతు పాత్ర పోషిస్తున్నాడని ఇటీవలే ఓ మీడియా సమావేశంలో అన్నాడు. ప్రస్తుతం కోహ్లీ టీమిండియాలో లేకపోవడంతో ఆ లోటును కొంత భర్తీ చేస్తూ ధోని కొత్త ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నాడు.

కొత్త వారికి మహీ భాయి ఎంతో సహకారాన్ని అందిస్తారు

కొత్త వారికి మహీ భాయి ఎంతో సహకారాన్ని అందిస్తారు

ఆసియా కప్ టోర్నీ కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్న ఓ కొత్త ఆటగాడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ "టీమిండియాలో అడుగుపెడుతున్న కొత్త వారికి మహీ భాయి ఎంతో సహకారాన్ని అందిస్తారు. ఓ ఛాంపియన్స్‌ టీమ్‌లోకి కొత్తగా వచ్చామన్న బిడియం మాలో కలగకుండా చేస్తారు. నెట్‌లో సాధన చేస్తున్న సమయంలోనూ ఆయన కొత్త బౌలర్లకు ఎల్లప్పుడూ సహకరిస్తారు" అని అన్నాడు.

బౌలర్లకి మంచి సలహాలు

బౌలర్లకి మంచి సలహాలు

"మ్యాచ్‌ కోసం బౌలర్లు ఎలా సన్నద్ధం కావాలనే విషయాన్ని కీపర్‌గా వికెట్ల వెనక తనకు ఉన్న అనుభవంతో వివరించి చెబుతారు. ముఖ్యంగా మైదానంలో మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో బౌలర్లకి మంచి సలహాలు ఇస్తారు. క్రీజులో ఎక్కడ బంతి పడేలా బౌలింగ్‌ చేయాలన్న విషయాన్ని చెబుతారు. అలాగే, ఆటగాళ్లకు చాలా స్వేచ్ఛ ఇచ్చి, దేశం తరఫున ఆడుతున్న వారిపై ఎలాంటి ఒత్తిడి పడకుండా చేస్తాడు" అని తెలిపాడు.

 జట్టులోకి కొత్తగా ప్రవేశించినప్పుడు

జట్టులోకి కొత్తగా ప్రవేశించినప్పుడు

మరో కొత్త ఆటగాడు మీడియాతో మాట్లాడుతూ"జట్టులోకి కొత్తగా ప్రవేశించినప్పుడు వారిని కలవాలంటే సంకోచిస్తాం. కానీ, ధోని, కోహ్లీలుు మాత్రం కొత్త వారితో స్నేహ పూరితంగా ఉంటారు. ధోని భాయి మాకు ఎల్లప్పుడూ సూచనలు ఇస్తారు. టీమ్‌ని ముందుకు నడిపించడం అంత సులువైన పనికాదు. కానీ ధోని భాయి టీమ్‌కి వైస్-కెప్టెన్‌లా అన్ని సమర్థవంతంగా అన్ని పనులూ చేస్తారు" అని చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, September 18, 2018, 15:14 [IST]
Other articles published on Sep 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X