న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్యాచ్ వదిలేస్తే.. శ్రీశాంత్‌ను అప్పుడే కొట్టేవాడిని: హర్భజన్

 What Harbhajan would have done had Sreesanth dropped Misbah in World T20 final

న్యూ ఢిల్లీ: ఆసియా కప్‌లో భాగంగా భారత్xపాక్‌ల మధ్య మ్యాచ్ మరి కొద్దిసేపట్లో మొదలుకానుంది. ఈ నేపథ్యంలో యావత్ క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో హర్భజన్ సింగ్ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ను గెలిచిన సందర్భం గుర్తు చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌కు ప్రత్యర్థిగా నిలిచింది పాకిస్తాన్ జట్టే.

భారత అభిమాని చూసేందుకు సాయం చేసిన పాక్ అభిమానిభారత అభిమాని చూసేందుకు సాయం చేసిన పాక్ అభిమాని

2007 ఫైనల్‌‌లో భారత్xపాక్‌ల మ్యాచ్‌

2007 ఫైనల్‌‌లో భారత్xపాక్‌ల మ్యాచ్‌

భారత్‌ గెలిచిన తొలి టీ20 ప్రపంచకప్‌( 2007) ఫైనల్‌ మ్యాచ్‌ అప్పుడు కూడా అంతే ఉత్కంఠభరితంగా సాగింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన తుదిపోరులో పేసర్‌ శ్రీశాంత్‌ అద్భుత క్యాచ్‌తో భారత్‌ ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్యాచ్‌ను శ్రీశాంత్‌ వదిలేసి ఉంటే అతనిపై చేయిచేసుకునేవాడినని టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ తెలిపాడు.

అదో అద్భుత సందర్భం.

అదో అద్భుత సందర్భం.

ఇండియా టు డే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న హర్భజన్‌ నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. అయితే ఈ టోర్నీ గెలిచినప్పుడు కలిగిన అనుభూతి 2011 ప్రపంచకప్‌ గెలిచినప్పుడు కూడా కలగలేదని అభిప్రాయపడ్డాడు.‘అదో అద్భుత సందర్భం. ఆ ప్రపంచకప్‌ గెలిచినప్పుడు కలిగిన అనుభూతి.. 2011 ప్రపంచకప్‌ గెలిచినప్పుడు కూడా అనిపించలేదు. ఈ విజయంతో భారత్‌ చేరుకున్నప్పుడు ముంబై వీధుల్లో జనాలు నిలబడి స్వాగతం పలకడం ఇంకా కళ్ల ముందే కదలుతోంది. ఎయిర్‌పోర్ట్‌ నుంచి వాంఖెడే స్టేడియం చేరుకోవడానికి 6 గంట ల సమయం పట్టింది.'

 ఆ క్యాచ్‌ను శ్రీశాంత్‌ అందుకోవడం

ఆ క్యాచ్‌ను శ్రీశాంత్‌ అందుకోవడం

'ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీశాంత్‌ ఆ క్యాచ్‌ను అందుకోవడం నిజంగా అదృష్టం. మిస్బా తన షాట్‌ను సరిగ్గా ఆడలేదు. ఆ అవకాశాన్ని శ్రీశాంత్‌ అందిపుచ్చుకున్నాడు. ఒకవేళ శ్రీశాంత్‌ ఆ క్యాచ్‌‌ను గనుక వదిలేసి ఉంటే.. ఈ టోర్నీ అనంతరం ఐపీఎల్‌లో జరిగిన ఘటన ముందే చోటుచేసుకునేది' అని హర్భజన్‌ పేర్కొన్నాడు.

మైదానంలోనే శ్రీశాంత్‌పై చేయిచేసుకున్న భజ్జీ

మైదానంలోనే శ్రీశాంత్‌పై చేయిచేసుకున్న భజ్జీ

2008 ఐపీఎల్‌ సందర్భంగా హర్భజన్‌ సహనం కోల్పోయి శ్రీశాంత్‌పై మైదానంలోనే చేయిచేసుకున్న విషయం తెలిసిందే. అత్యంత ఉత్కంఠగా సాగిన నాటి ఫైనల్‌ మ్యాచ్‌ భారత్‌-పాక్‌ అభిమానులు మరిచిపోలేరు. ఇరు జట్లను కడదాక ఊరించిన విజయం చివరకు భారత్‌ వశం అయ్యింది.

Story first published: Wednesday, September 19, 2018, 16:32 [IST]
Other articles published on Sep 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X