న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

0,0,0,0,0,0.. షమీ ట్రాక్ రికార్డు ఇది!!

West Indies vs India: How many runs did Mohammed Shami score in his last 6 innings

కింగ్‌స్టన్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో భారత జట్టు దూసుకెళుతోంది. ప్రపంచంలోని నంబర్-1 టెస్ట్ జట్టు ట్యాగ్‌ను సంపూర్ణ ఆధిపత్యంతో నిరూపించింది. కీలక సమయాల్లో ఆటగాళ్లు సత్తా చాటడంతో భారత్ విజయాలను అందుకుంటోంది. అయితే భారత్ ఆధిపత్యం వెనుక ఉన్న ప్రధాన కారణం ఫాస్ట్ బౌలర్లు. కొందరు బంతితోనే కాదు బ్యాట్‌తో కూడా మెరుస్తున్నారు.

వెస్టిండీస్‌తో రెండో టెస్ట్‌.. ధోనీ రికార్డును బద్దలు కొట్టిన పంత్‌!!వెస్టిండీస్‌తో రెండో టెస్ట్‌.. ధోనీ రికార్డును బద్దలు కొట్టిన పంత్‌!!

చంద్రశేఖర్‌ రికార్డు సమం:

చంద్రశేఖర్‌ రికార్డు సమం:

భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ మొదటి ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. జడేజా కూడా కీలక పరుగులు చేస్తున్నాడు. అయితే పేసర్‌ మహ్మద్‌ షమీ మాత్రం బ్యాటింగ్‌లో పూర్తిగా తేలిపోతున్నాడు. ఈ క్రమంలోనే టెస్టు క్రికెట్‌లో ఓ చెత్త రికార్డును నమోదు చేసాడు. పదో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌ అయిన షమీ వరుసగా ఆరు ఇన్నింగ్స్‌లలో సున్నా పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. దీంతో టెస్టుల్లో భారత్‌ తరఫున ఇలాంటి ప్రదర్శనే చేరిన బి. చంద్రశేఖర్‌ రికార్డును సమం చేశాడు.

సున్నాల పరంపర అప్పటినుండే:

సున్నాల పరంపర అప్పటినుండే:

గతేడాది అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌ నుంచి షమీ సున్నాల పరంపర సాగుతోంది. ఇప్పటికైనా షమీ సున్నాలను పక్కనపెడతాడో లేదో చూడాలి. టెస్ట్ మ్యాచ్‌లలో లోయర్ ఆర్డర్ పరుగులు చేయడం కీలకం కాబట్టి హెడ్ కోచ్ రవిశాస్త్రి ఫాస్ట్ బౌలర్‌తో కూర్చుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. అయితే షమీ బౌలింగ్ విషయానికొస్తే మాత్రం అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇషాంత్, బుమ్రాతో కలిసి వికెట్లు తీస్తున్నాడు.

నా వంతు సాయం చేస్తా:

నా వంతు సాయం చేస్తా:

'జట్టులో సీనియర్ బౌలర్లు ఉన్నారు. ఇషాంత్ అందరికంటే ఎక్కువ క్రికెట్ ఆడాడు. షమీ కూడా విదేశాల్లో ఆడాడు. షమీ గత కొంత కాలంగా మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. నేను కొత్త వాడిని కాబట్టి ఇషాంత్, షమీలకు నా వంతు సాయం చేస్తా. గతంలో ఇక్కడ ఆడిన అనుభవం వారికి ఉంది కాబట్టి ఏవైనా సందేహాలు ఉంటే అడిగి తెలుసుకుంటా. వికెట్ సహకరించకపోతే ఎలా బంతులు వేయాలో వారిని అడుగుతా' అని బుమ్రా పేర్కొన్నాడు.

తొలి శతకం నాన్నకు అంకితం.. ఎక్కడున్నా ఆయన గర్వించే ఉంటారు: విహారి

షమీ సున్నాల పరంపర:

షమీ సున్నాల పరంపర:

0 (2) vs వెస్టిండీస్ (కింగ్‌స్టన్‌)

0 (1) vs వెస్టిండీస్ (నార్త్ సౌండ్)

0 * (3) vs ఆస్ట్రేలియా (మెల్బోర్న్)

0 * (0) vs ఆస్ట్రేలియా (పెర్త్)

0 (1) vs ఆస్ట్రేలియా (పెర్త్)

0 (1) vs ఆస్ట్రేలియా (అడిలైడ్)

Story first published: Monday, September 2, 2019, 17:35 [IST]
Other articles published on Sep 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X