న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో టెస్టు తుది జట్టులోకి అశ్విన్‌ను ఎందుకు తీసుకోలేదో చెప్పిన రవిశాస్త్రి

West Indies vs India: Head Coach Ravi Shastri explains Ashwin’s non-inclusion in West Indies Test Squad

జమైకా: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సీనియర్ సిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఎందుకు తీసుకోలేదో ప్రధాన కోచ్ రవిశాస్త్రి తెలిపారు. అశ్విన్ తొలి టెస్టులో లేకపోవడం చాలా ప్రశ్నలను లేవనెత్తింది. కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీలు విమర్శల వర్షం కురిపించారు. అయితే అశ్విన్ స్థానంలో జట్టులోకి వచ్చిన రవీంద్ర జడేజా సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో అర్ధ సెంచరీ చేయడం.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీయడంతో జడేజాకు మళ్లీ అవకాశం దక్కింది.

సెప్టెంబర్‌ 5 నుంచి భారత సహాయక సిబ్బందికి కొత్త కాంట్రాక్ట్‌లుసెప్టెంబర్‌ 5 నుంచి భారత సహాయక సిబ్బందికి కొత్త కాంట్రాక్ట్‌లు

ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్:

ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్:

తాజాగా కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ... 'మొదటి టెస్టులో జడేజాను ఎంచుకోవడానికి కారణం ఉంది. ఇటీవల జడేజా రికార్డు చాలా బాగుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్. జట్టుకు అతని బ్యాటింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మొదటి టెస్టులో ఇది చూసాం. స్పిన్‌కు సహకరించని పిచ్‌పై కూడా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అశ్విన్‌ కూడా గొప్ప బౌలర్ అయినప్పటికీ.. ఈ కారణాలతో జడేజాను తీసుకున్నాం. అతన్ని పక్కన పెట్టడం కఠిన నిర్ణయం' అని రవిశాస్త్రి తెలిపాడు.

నా అంచనా తప్పయింది

నా అంచనా తప్పయింది

ఇటీవలే గుంగూలీ మాట్లాడుతూ... 'రోహిత్‌, అశ్విన్‌లు తుది జట్టులో ఉంటారనే అనుకున్నా. కానీ.. నా అంచనా తప్పయింది. వారు జట్టులో లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. పేస్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో ముగ్గురు పేస్ బౌలర్లతో సిద్ధం కావడం సరైన నిర్ణయమే. కానీ..స్పెషలిస్టు స్పిన్నర్‌గా అశ్విన్‌కు చోటు కల్పించకపోవడం సరైనది కాదు. విండీస్‌పై అశ్విన్‌కు మంచి రికార్డు ఉంది' అని గుర్తు చేసాడు.

వెస్టిండీస్‌పై ఘనమైన రికార్డు:

వెస్టిండీస్‌పై ఘనమైన రికార్డు:

అశ్విన్‌కు వెస్టిండీస్‌పై ఘనమైన రికార్డే ఉంది. విండీస్‌పై ఇప్పటివరకు 11 టెస్టులు ఆడిన అశ్విన్‌ 60 వికెట్లను పడగొట్టాడు. ఇందులో ఐదు వికెట్లను నాలుగు సందర్భాల్లో సాధించాడు. అంతేకాకుండా 552 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉండటం విశేషం. 2016లో వెస్టిండీస్‌లో భారత్ పర్యటించినపుడు అశ్విన్‌ 17 వికెట్లు పడగొట్టాడు, అంతేకాదు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా అందుకున్నాడు.

Story first published: Sunday, September 1, 2019, 21:49 [IST]
Other articles published on Sep 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X