న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వెస్టిండీస్‌తో తొలి టెస్టు.. గంగూలీ-సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేసిన కోహ్లీ-రహానే

West Indies vs India, 1st Test: Virat Kohli-Ajinkya Rahane break Sachin Tendulkar-Sourav Ganguly’s partnership record

ఆంటిగ్వా: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానేలు అరుదైన ఘనతను నమోదు చేశారు. టెస్టు క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు సాధించిన జోడిగా కోహ్లీ-రహానేలు రికార్డుల్లోకి ఎక్కారు. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ (51 బ్యాటింగ్‌), రహానే (53 బ్యాటింగ్‌)లు అర్ధ సెంచరీలు చేసి రాణించడంతో 104 పరుగుల్ని జత చేశారు. దీంతో భారత్‌ తరఫున అత్యధిక సార్లు వంద పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన జోడిగా కొత్త రికార్డు నమోదు చేశారు.

<strong>అశ్విన్‌పై వేటు.. కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌?</strong>అశ్విన్‌పై వేటు.. కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌?

గంగూలీ-సచిన్‌ రికార్డు బద్దలు:

గంగూలీ-సచిన్‌ రికార్డు బద్దలు:

104 పరుగుల్ని జత చేయడంతో భారత మాజీ ఆటగాళ్లు సౌరవ్‌ గంగూలీ-సచిన్‌ టెండూల్కర్‌ల రికార్డును కోహ్లీ-రహానేలు బద్దలు కొట్టారు. నాలుగో వికెట్‌కు గంగూలీ-సచిన్‌లు ఏడుసార్లు సెంచరీ భాగస్వామ్యాల్ని సాధించగా.. కోహ్లీ-రహానేలు ఎనిమిదో సారి వంద పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. భారత్‌ తరఫున టెస్టు ఫార్మాట్‌లో నాలుగో వికెట్‌కు అత్యధిక సార్లు వంద పరుగులు భాగస్వామ్యాల్ని సాధించిన జోడిల జాబితాలో కోహ్లీ-రహానేలు తొలి స్థానంలో ఉన్నారు.

మూడో స్థానంలో అజహరుద్దీన్‌-సచిన్‌ల జోడి:

మూడో స్థానంలో అజహరుద్దీన్‌-సచిన్‌ల జోడి:

కోహ్లీ-రహానేల జోడి తర్వాత గంగూలీ-సచిన్‌ల జోడి ఉంది. అనంతరం మహ్మద్‌ అజహరుద్దీన్‌-సచిన్‌ల జోడి ఆరుసార్లు వంద పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి మూడో స్థానంలో కొనసాగుతోంది. విండీస్‌తో రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి రహానే (53 బ్యాటింగ్‌), కోహ్లీ (51 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. భారత్‌ 72 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్‌ 260 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

టాపార్డర్‌ విఫలం:

టాపార్డర్‌ విఫలం:

ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (16) రెండో ఇన్నింగ్‌లోనూ నిరాశపరిచాడు. బంతిని తప్పుగా అంచనా వేసి చేజ్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (38; 85 బంతుల్లో 4×4) పుజారా (25; 53 బంతుల్లో 1×4)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. విండీస్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్న ఈ జోడి స్కోరును ముందుకు నడిపారు. అయితే 30వ ఓవర్‌లో రాహుల్‌ను చేజ్‌ బౌల్డ్‌ చేశాడు. కాసేపటికే పుజారాను రోచ్‌ పెవిలియన్ చేర్చాడు. దీంతో 81 పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది.

కోహ్లీ, ర‌హానే అర్ధ‌సెంచరీలు.. భారీ ఆధిక్యం దిశగా భారత్‌

కోహ్లీ-రహానే సెంచరీ భాగస్వామ్యం:

కోహ్లీ-రహానే సెంచరీ భాగస్వామ్యం:

కష్టాల్లో ఉన్న భారత్‌ను కోహ్లీ,రహానే ఆదుకున్నారు. ఈ జోడి భారత్‌ ఇన్నింగ్‌ను చక్కదిద్దారు. విండీస్‌ బౌలర్లను ఆచితూచి ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. బౌండరీల జోలికి పోకుండా స్ట్రైక్ రొటేట్ చేసారు. ఈ క్రమంలోనే 68వ ఓవర్‌లో రహానే.. 71వ ఓవర్‌లో కోహ్లీ అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. కోహ్లీ,రహానేలు నాలుగో వికెట్‌కి 104 పరుగుల భాగ‌స్వామ్యం న‌మోదు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో 81 పరుగులతో మెరిసిన రహానే.. మరోసారి ఆకట్టుకున్నాడు.

Story first published: Sunday, August 25, 2019, 15:02 [IST]
Other articles published on Aug 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X