న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంగ్లాదేశ్ తుక్కురేగ్గొట్టిన వెస్టిండీస్.. 2-0తేడాతో సిరీస్ వైట్ వాష్, ఓటముల్లో బంగ్లా సెంచరీ

West Indies Sweeps Test series with 2-0 against Bangladesh, its 100th test Defeat for Bangla

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండోది మరియు ఆఖరి టెస్టులో నాలుగో రోజు ఆతిథ్య వెస్టిండీస్‌ అతి సులువుగా గెలుపొందింది. మూడో రోజు బంగ్లాదేశ్ బ్యాటర్లు పేలవంగా ఆడారు. తొలి ఇన్నింగ్స్‌లో 174పరుగుల వెనుకంజలో ఉన్న బంగ్లాదేశ్.. మూడో రోజు పెద్దగా ప్రభావవంతగా ఆడలేకపోయింది. ఆరు వికెట్లు కోల్పోయింది. 186పరుగులకు ఆలౌట్ అయ్యింది. తద్వారా కేవలం 12 పరుగుల ఆధిక్యాన్ని మాత్రమే బంగ్లా సాధించగలిగింది. ఇక 13 పరుగుల లక్ష్యాన్ని నాలుగో రోజు వెస్టిండీస్ ఓపెనర్లు కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (6 బంతుల్లో 4), జాన్ కాంప్‌బెల్ (11 బంతుల్లో 9) ఛేదించడంతో సిరీస్‌ను వెస్టిండీస్ 2 - 0 తేడాతో వైట్ వాష్ చేయగలిగింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా కైల్ మేయర్స్ నిలిచాడు. తద్వారా బంగ్లాదేశ్ ఘోర పరాజయాన్ని అందుకుంది. ఇక బంగ్లాదేశ్‌కు టెస్టుల్లో ఇది వందో ఓటమి కావడం గమనార్హం.
ఇక బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 234పరుగులకు ఆలౌట్ అయింది. లిట్టన్ దాస్ (53పరుగులు 70బంతుల్లో 8ఫోర్లు) హాఫ్ సెంచరీ మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. విండీస్ బౌలర్లలో జైడెన్ సీల్స్, అల్జారీ జోసేఫ్ తలా మూడు వికెట్లు తీయగా, ఆండ్రూ ఫిలిప్, కైల్ మేయర్స్ తలా 2వికెట్లు సాధించి బంగ్లా పతనాన్ని శాసించారు. ఇక తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన విండీస్ కైల్ మేయర్స్ (146పరుగులు 208బంతుల్లో 18ఫోర్లు, 2సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ క్రెగ్ బ్రాత్ వైట్ (51పరుగులు 107బంతుల్లో 7ఫోర్లు) రాణించడంతో 408పరుగులు చేసింది. తద్వారా 174పరుగుల ఆధిక్యం విండీస్‌కు లభించింది. బంగ్లా బౌలర్లలో ఖలీద్ అహ్మద్ ఐదు వికెట్లు తీసినప్పటికీ అది విండీస్‌ను పెద్దగా దెబ్బకొట్టలేకపోయింది. మెహిదీ హసన్ 3, షరీఫుల్ ఇస్లామ్ 2 వికెట్లు తీశారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన బంగ్లా నూరుల్ హసన్ (60), షాన్టో (42) మినహా మిగతావారు విఫలం కావడంతో కేవలం 186పరుగులకే చాప చుట్టేసింది. కీమర్ రోచ్, జైడెన్ సీల్స్, అల్జారీ జోసెఫ్ తలా మూడు వికెట్లు తీసి బంగ్లా తుక్కురేగ్గొట్టారు. కీమర్ రోచ్ టెస్టుల్లో తన 250వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఇక కేవలం 13పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ అలవోకగా చేదించి మరో రోజు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.

Story first published: Tuesday, June 28, 2022, 10:36 [IST]
Other articles published on Jun 28, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X