న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అత్యధిక పరుగులు చేసేది అతడే: యాషెస్ విజేత ఎవరో చెప్పేసిన లారా!

West Indies legend Brian Lara predicts Ashes winner and lot more

హైదరాబాద్: గురువారం ప్రారంభమైన 71వ యాషెస్ సిరిస్‌లో విజేత ఆతిథ్య జట్టేనని వెస్టిండిస్ మాజీ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా అంచనా వేశాడు. ఇటీవలే విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లాండ్ జట్టు సొంతగడ్డపై ఆస్ట్రేలియా ఓడించి యాషెస్‌ను సొంతం చేసుకుంటుందని లారా వెల్లడించాడు.

యాషెస్ సిరిస్‌లో ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జో రూట్‌ ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడని జోస్యం చెప్పాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో లారా "యాషెస్‌ 2019లో విజేత ఇంగ్లండ్‌. అత్యధిక పరుగులు చేసే బ్యాట్స్‌మెన్‌ జో రూట్‌, అత్యధిక వికెట్లు తీసే ఆటగాడు క్రిస్‌ వోక్స్‌" అంటూ ట్వీట్ చేశాడు.

విచిత్ర ఘటన.. అభిమానుల ప్రేమకు 'ఫిదా' అయిన కోహ్లీ (వీడియో)విచిత్ర ఘటన.. అభిమానుల ప్రేమకు 'ఫిదా' అయిన కోహ్లీ (వీడియో)

ఇంగ్లాండ్‌ బౌలర్లు చెలరేగిన వేళ... అసాధారణ ఇన్నింగ్స్‌ ఆడిన స్టీవ్‌ స్మిత్‌ (144; 219 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సులు) అద్భుతమైన సెంచరీతో ఆదుకోవడంతో యాషెస్‌ తొలి టెస్టులో తొలి రోజును ఆస్ట్రేలియా కాస్త గౌరవంగా ముగించింది. టెస్టుల్లో స్మిత్‌కు ఇది 24వ టెస్టు సెంచరీ కాగా యాషెస్‌లో మాత్రం నాలుగో సెంచరీ.

పునరాగమనం తర్వాత స్మిత్‌ తొలి టెస్టు సెంచరీ

పునరాగమనం తర్వాత స్మిత్‌ తొలి టెస్టు సెంచరీ

బాల్ టాంపరింగ్ పునరాగమనం తర్వాత స్టీవ్ స్మిత్‌కి ఇదే తొలి టెస్టు సెంచరీ. ఎడ్జిబాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలిరోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 80.4 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్ 2 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 10 పరుగులు చేసింది.

టాస్ గెలిచిన ఆసీస్

టాస్ గెలిచిన ఆసీస్

బర్న్స్‌ (4), జేసన్‌ రాయ్‌ (6) క్రీజులో ఉన్నారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియాను ఇంగ్లాండ్ బౌలర్లు ఆరంభంలోనే దెబ్బతీశారు. ఓపెనర్లు వార్నర్‌ (2), బాన్‌క్రాఫ్ట్‌ (8)లను స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌ చేర్చాడు. ఖవాజా (13) కూడా ఎక్కువసేపు నిలవలేదు. 35 పరుగులకే 3 వికెట్లు పడిన దశలో స్మిత్‌, హెడ్‌ (35)తో కలిసి ఇన్నింగ్స్‌ను సరిదిద్దాడు.

లంచ్ విరామానికి 83/3

లంచ్ విరామానికి 83/3

లంచ్ విరామానికి ఆసీస్‌ 83/3తో నిలిచింది. స్టువర్ట్ బ్రాడ్‌తో వోక్స్‌ విజృంభించడంతో ఆసీస్ వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. హెడ్‌తో పాటు వేడ్‌ (1), పైన్‌ (5), పాటిన్సన్‌ (0), కమిన్స్‌ (5) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. 23 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. దీంతో ఆసీస్ స్కోరు కనీసం 150 పరుగులైనా దాటుతుందా అనిపించింది.

పీటర్‌ సిడిల్‌ నుంచి అనూహ్య మద్దతు

పీటర్‌ సిడిల్‌ నుంచి అనూహ్య మద్దతు

ఇలాంటి పరిస్థితుల్లో స్మిత్‌కు లోయర్‌ ర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పీటర్‌ సిడిల్‌ (85 బంతుల్లో 44; 4 ఫోర్లు) సహకరించాడు. వీరిద్దరి తొమ్మిదో వికెట్‌కు 88 పరుగులు జత చేయడంతో ఆసీస్‌ 210/8తో కోలుకుంది. కానీ సిడిల్‌ను అలీ ఔట్‌ చేయడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ముగియడానికి ఎక్కువ సమయం పట్టదనిపించింది.

5 వికెట్లు తీసిన స్టువర్ట్ బ్రాడ్

5 వికెట్లు తీసిన స్టువర్ట్ బ్రాడ్

అయితే, స్మిత్ పట్టువదలకుండా నాథన్ లియాన్(12 నాటౌట్‌)తో కలిసి చివరి వరకు పోరాడాడు. ఈ క్రమంలో 184 బంతుల్లో సెంచరీ చేసిన స్మిత్‌ను బ్రాడ్‌ బౌల్డ్ చేశాడు. దీంతో ఆఖరి వికెట్‌కు లైయన్‌తో కలిసి స్టీవ్ స్మిత్‌ 74 పరుగులు జోడించడం విశేషం. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టువర్ట్‌ బ్రాడ్‌ (5/86), క్రిస్‌ వోక్స్‌ (3/58) అద్భుత ప్రదర్శన చేశారు.

Story first published: Friday, August 2, 2019, 12:28 [IST]
Other articles published on Aug 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X