న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత పర్యటనకు ముందు వెస్టిండిస్ కోచ్‌గా మాంటీ దేశాయ్

West Indies appoint Monty Desai as batting coach ahead of India series

హైదరాబాద్: వెస్టిండిస్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా మాంటీ దేశాయ్‌ను బుధవారం ఆ దేశ్ బోర్డు నియమించింది. ఈ మేరకు అతడితో రెండేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం వెస్టిండిస్ జట్టు భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా వెస్టిండిస్ జట్టు 3 టీ20లు, 3 వన్డేల సిరిస్ ఆడనుంది.

భారత పర్యటనకు ముందు మాంటీ దేశాయ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించడం ప్రత్యేకత సంతరించుకుంది. మాంటీ దేశాయ్ ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ 2లో కెనడా ప్రధాన కోచ్‌గా, 2018లో జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ అర్హత టోర్నమెంట్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు.

గంగూలీ ఖాతాలో మరో మైలురాయి: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్‌కి సన్నాహాలు!గంగూలీ ఖాతాలో మరో మైలురాయి: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్‌కి సన్నాహాలు!

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫికేషన్ ఈవెంట్‌లో

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫికేషన్ ఈవెంట్‌లో

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫికేషన్ ఈవెంట్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా వ్వవహారించాడు. వెస్టిండిస్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికవడంపై మాంటీ దేశాయ్ మాట్లాడుతూ "విజయవంతమైన పని వాతావరణాన్ని సృష్టించడానికి, కొత్త సంస్కృతిని నేర్చుకోవడంతో పాటు స్వీకరించడానికి నేను చాలా అతృతగా ఎదురు చూస్తున్నాను" అని అన్నాడు.

ఆసక్తిగా ఉన్నా

ఆసక్తిగా ఉన్నా

"హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ మరియు క్రికెట్ డైరెక్టర్ జిమ్మీ ఆడమ్స్‌లతో పాటు మా కెప్టెన్లతో కలిసి పనిచేయడానికి నేను ఆసక్తిగా ఉన్నాను. మా జట్టు విజయానికి నేను అన్ని రకాలుగా సహకరించగలను" అని మాంటీ దేశాయ్ తెలిపాడు. ఆటగాళ్లు ప్రతిభను మెరుగుపర్చడానికి, మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి దేశాయ్ సహకారం కోసం ఎదురు చూస్తున్నానని విండిస్ హెడ్ కోచ్ సిమన్స్ చెప్పాడు.

మాంటీతో కలిసి పనిచేశా

మాంటీతో కలిసి పనిచేశా

సిమన్స్ మాట్లాడుతూ "నేను గతంలో మాంటీతో కలిసి పనిచేశాను. అతను అద్భుతమైన కోచ్. ఆటగాళ్లను వారి ప్రతిభను మెరుగుపర్చడానికి, మ్యాచ్‌లలో మెరుగైన ప్రదర్శన కనబరచగల సామర్థ్యం తనకు ఉందని అతను నిరూపించాడు. ఆట గురించి అతడు అపారమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. అతను భారత్‌లో మాతో కలిసి ప్రారంభించడం మంచిదే" అని సిమన్స్ తెలిపాడు.

Story first published: Wednesday, December 4, 2019, 14:16 [IST]
Other articles published on Dec 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X