న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు: డ్వేన్‌ బ్రావో సంచలన నిర్ణయం

India vs Windies 2018, 2nd ODI : WIndies allrounder Dwayne Bravo retires from international Cricket
West Indies all-rounder Dwayne Bravo retires from international cricket

హైదరాబాద్: వెస్టిండిస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలుకుతున్నట్లు గురువారం ప్రకటించాడు. అయితే తాను క్రికెటర్‌గా ప్రొఫెషనల్‌ కెరీర్‌ను కొనసాగిస్తానని బ్రావో ఈ సందర్భంగా తెలిపాడు.

చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్: టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్: టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు

దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ20 క్రికెట్‌ లీగ్‌ల్లో ఆడతానని అన్నాడు. దీని అర్ధం ఇండియన్ ప్రీమియర్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, బిగ్ బాష్ లీగ్ లాంటి లీగ్‌ల్లో ఆడతానని చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి అధికారికంగా తప్పుకుంటున్నట్టు బ్రేవో బుధవారం రాత్రి ప‍్రకటించాడు.

 2012, 2016 టీ20 వరల్డ్‌కప్‌ల్లో కీలక పాత్ర

2012, 2016 టీ20 వరల్డ్‌కప్‌ల్లో కీలక పాత్ర

35 ఏళ్ల బ్రావో 2016 సెప్టెంబర్లో చివరిసారిగా విండీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అంతేకాదు 2012, 2016 టీ20 వరల్డ్ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన బ్రావో.. వెస్టిండిస్ జట్టు తరుపున 270 మ్యాచ్‌ల్లో బరిలో దిగాడు. తన రిటైర్మెంట్ సందర్భంగా బ్రావో మీడియాతో మాట్లాడాడు.

2004లో ఇంగ్లాండ్‌పై తొలి మ్యాచ్ ఆడటానికి

2004లో ఇంగ్లాండ్‌పై తొలి మ్యాచ్ ఆడటానికి

"14 ఏళ్ల క్రితం వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేశాను. నాకు ఇప్పటికీ ఆ క్షణాలు గుర్తున్నాయి. 2004లో ఇంగ్లాండ్‌పై తొలి మ్యాచ్ ఆడటానికి లార్డ్స్‌లోకి అడుగుపెట్టే ముందు మెరూన్ క్యాప్ అందుకున్నాను. సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడాను. తర్వాతి తరం క్రికెటర్లకు అవకాశం ఇవ్వడం కోసం రిటైర్ అవుతున్నా" అని బ్రావో అన్నాడు.

వెస్టిండిస్ తరుపున 40 టెస్టులు

వెస్టిండిస్ తరుపున 40 టెస్టులు

వెస్టిండిస్ తరుపున 40 టెస్టులు ఆడిన బ్రావో 31.43 యావరేజితో 2200 పరుగులు చేయడంతోపాటు 86 వికెట్లు తీశాడు. ఇక, 164 వన్డేలాడిన బ్రావో 2968 పరుగులు చేయడంతోపాటు 199 వికెట్లు పడగొట్టాడు. 66 టీ20ల్లో 1142 పరుగులు చేసి, 52 వికెట్లు తీశాడు.

 2010లో శ్రీలంకపై చివరి టెస్ట్

2010లో శ్రీలంకపై చివరి టెస్ట్

వెస్టిండిస్ జట్టు తరుపున చివరిసారిగా 2010లో శ్రీలంకపై చివరి టెస్ట్ ఆడాడు. 2014లో భారత్‌పై ఆఖరి వన్డే ఆడిన బ్రావో.. 2016లో పాక్‌పై చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం బ్రావో కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ రినిగేడ్స్, పీఎస్ఎల్‌లో పెషావర్ జల్మీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

Story first published: Thursday, October 25, 2018, 13:03 [IST]
Other articles published on Oct 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X