న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టోర్నీ నుంచి నిష్క్రమణ: సన్‌రైజర్స్ ఓటమిపై కెప్టెన్ విలియమ్సన్

IPL 2019,Eliminator : Kane Williamson Says 'It’s Frustrating When Margin Is So Small' || Oneindia
We werent as clinical as wed have liked, says Sunrisers captain Kane Williamson

హైదరాబాద్: విశాఖ వేదికగా బుధవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో చివరివరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. లీగ్ స్టేజిలో కేవలం 12 పాయింట్లతో మెరుగైన రన్‌రేట్‌ను కలిగి ఉండటంతో ప్లేఆఫ్స్‌‌కు అర్హత సాధించిన సన్‌రైజర్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఖలీల్ అహ్మద్ ఇంకా రెండు ఓవర్లు వేయాల్సి ఉన్నా... ఇన్నింగ్స్ 18వ ఓవర్ బసిల్ థంపితో వేయించడమే సన్‌రైజర్స్ ఓటమికి కారణమంటూ వస్తున్న వార్తలపై ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పందించాడు. "రిషబ్ పంత్ ఎడమచేతివాటం బ్యాట్స్‌మన్ కావడంతో కుడిచేతివాటం పేసర్ సరైన ఆప్షన్ అని అనుకున్నాం" అని చెప్పుకొచ్చాడు.

పంత్ అద్భుత ఆటగాడు

పంత్ అద్భుత ఆటగాడు

"అయితే, రిషబ్ పంత్ అద్భుతమైన ఆటగాడని... అతడిని ఒత్తిడిలోకి నెట్టినా... మా ప్రణాళికలను అమలు చేయనివ్వకుండా చేశాడు" అని విలియమ్సన్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

విలియమ్సన్ మాట్లాడుతూ

విలియమ్సన్ మాట్లాడుతూ

దీనిపై విలియమ్సన్ మాట్లాడుతూ "మేం నిర్దేశించింది మంచి లక్ష్యమే. ఈ పిచ్‌పై ఎంత కావాలో అంత లక్ష్యం ప్రత్యర్థి ముందు ఉంచాం. అయితే ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా ఆడారు. ఈ విజయానికి వాళ్లు పూర్తి అర్హులు. ఢిల్లీ ఆటగాళ్లు అన్ని విభాగాల్లోనూ జట్టుగా రాణించారు. మేం బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విషయాల్లో అవకాశాలు జారవిడిచాం" అని అన్నాడు.

వందశాతం రాణించామని చెప్పడం లేదు

వందశాతం రాణించామని చెప్పడం లేదు

"ఈ మ్యాచ్‌లో వందశాతం రాణించామని చెప్పడం లేదు. ఎందుకంటే ఇలాంటి కీలకమైన మ్యాచుల్లో ప్రతీ ఆటగాడు రాణించాల్సి ఉంటుంది. కానీ, మా జట్టులో అలా జరగలేదు. డేవిడ్ వార్నర్‌, బెయిర్‌స్టో లేకుండా బరిలో దిగిన మ్యాచ్‌ల్లోనూ బాగానే ఆడాం. అయితే, అన్ని ప్రతి మ్యాచ్‌లో దాదాపు విజయతీరాలకు వచ్చి ఓడిపోయాం. వచ్చే సీజన్‌లో మరింత రాణించేందుకు కృషి చేస్తాం" అని కేన్ విలియమ్సన్ చెప్పాడు.

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓడిపోవడం మూడో సారి

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓడిపోవడం మూడో సారి

ఇదిలా ఉంటే సన్‌‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓడిపోవడం మూడో సారి. ఐపీఎల్ చరిత్రలో రెండు సార్లు ఫైనల్‌లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్ 2016తో టైటిల్ విజేతగా నిలవగా.... 2018లో జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.

Story first published: Thursday, May 9, 2019, 14:20 [IST]
Other articles published on May 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X