న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌పైనా కరోనా ఎఫెక్ట్.. ఇకపై ఆటగాళ్లతో కరచాలనం చేయం: జో రూట్

We are not shaking hands with each other: Joe Root on coronavirus threat ahead Sri Lanka tour

లండన్‌: చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా (కొవిడ్‌-19) వైరస్ ప్రభావం క్రికెట్‌పైనా పడింది. కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో క్రికెటర్లు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈనెల 19 నుంచి శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌లో ఆ ఆటగాళ్లతో కరచాలనం చేయబోమని ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్‌ స్పష్టం చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రూట్ వెల్లడించాడు.

'విరాట్ 70 శతకాలు చేసాడు.. అలాంటి కోహ్లీ టెక్నిక్‌ను ఎలా ప్రశ్నిస్తారు''విరాట్ 70 శతకాలు చేసాడు.. అలాంటి కోహ్లీ టెక్నిక్‌ను ఎలా ప్రశ్నిస్తారు'

జట్టుకు పలు సూచనలు:

జట్టుకు పలు సూచనలు:

తాజాగా జో రూట్‌ మాట్లాడుతూ... 'దక్షిణాఫ్రికా పర్యటనలో మా జట్టు అనారోగ్యానికి గురైంది. అయితే తొందరగానే కోలుకున్నాం. వైరస్‌ల కారణంగా.. వీలైనంత మేరకు ఇతరులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. అధికారికంగా మా వైద్య బృందం జట్టుకు పలు సూచనలు చేసింది. ప్రమాదకర బ్యాక్టీరియా దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆటగాళ్లకు ఇప్పటికే సూచించింది' అని తెలిపాడు.

 ఆట‌గాళ్ల‌తో చేతులు కలపబోం:

ఆట‌గాళ్ల‌తో చేతులు కలపబోం:

'ఇకనుంచి మైదానంలో మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉంటాం. ఆట‌గాళ్ల‌తో చేతులు కలపబోం. అందుకు బదులు ఫిస్ట్‌ బంప్స్‌ (పిడికిళ్లతో పలకరింపు) పద్ధతిని పాటిస్తాం. మేం తరచూ చేతులు కడుక్కొని శుభ్రత పాటిస్తున్నాం. మాకు ఇచ్చిన ఇమ్యూనిటీ ప్యాక్‌లలో ఉన్న యాంటీ బాక్టీరియల్ వైప్స్, జెల్స్ ఉపయోగిస్తున్నాం' అని జో రూట్‌ పేర్కొన్నాడు.

యథావిధిగా శ్రీలంక సిరీస్‌:

యథావిధిగా శ్రీలంక సిరీస్‌:

'కరోనా విజృంభిస్తున్నా లంక సిరీస్‌ నిర్వహణకు ఆటంకం కలుగుతుందనే సమాచారం లేదు. ఎల్లప్పుడూ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. వారి సూచన మేరకే మేం నడుచుకుంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఇంగ్లాండ్‌-శ్రీలంక టెస్టు సిరీస్‌ యథావిధిగా కొనసాగుతుంది' అని జో రూట్‌ చెప్పుకొచ్చాడు.

దక్షిణాఫ్రికా పర్యటనలో అనారోగ్య సమస్యలు:

దక్షిణాఫ్రికా పర్యటనలో అనారోగ్య సమస్యలు:

ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఇంగ్లండ్ జట్టు అక్కడ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంది. పది మంది ఆటగాళ్లతో పాటు కొందరు సహాయక సిబ్బందికి సైతం అంతుచిక్కని వైరస్‌ సోకింది. అనంతరం వారు త్వరగా కోలుకున్నారు. ఈ నేపథ్యంలో లంకతో జరగబోయే టెస్టు సిరీస్‌లో కరచాలనం చేయమంటున్నారు. ఇంగ్లండ్-శ్రీలంక జట్ల మధ్య మార్చి 19 నుంచి 31 వరకు రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. అంతకుముందు ఇంగ్లండ్-శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్‌ XIతో రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడనుంది.

Story first published: Tuesday, March 3, 2020, 14:15 [IST]
Other articles published on Mar 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X