న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాక్సింగ్ డే టెస్టులో భారత్ విజయం: చిన్నారి అభిమానికి కోహ్లీ గిప్ట్ ఇదే

Watch: Virat Kohli brightens up a young fans day by gifting him his pads

హైదరాబాద్: బాక్సింగ్ డే టెస్టులో గెలిచిన ఆనందంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ప్యాడ్లను మైదానంలోని ఓ చిన్నారి అభిమానికి గిప్ట్‌గా అందజేశాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో మెల్ బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్‌ 137 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

<strong>ఘనత అంతా బౌలర్లదే: 2018 బుమ్రా, షమీ, ఇషాంత్‌లదే</strong>ఘనత అంతా బౌలర్లదే: 2018 బుమ్రా, షమీ, ఇషాంత్‌లదే

బాక్సింగ్‌ డే టెస్టులో భారత్‌పై ఆస్ట్రేలియా జట్టుకు ఓటమి లేదు. అయితే, ఈసారి మాత్రం కోహ్లీసేన వారికి ఓటమి రుచి చూపించింది. ఆఖరి రోజు కేవలం రెండు వికెట్ల దూరంలో నిలిచిన భారత విజయంపై వరుణుడు కాస్త ఉత్కంఠ రేపాడు. అయితే, రెండు వికెట్లను భారత్ 4.3 ఓవర్లలోనే నేలకూల్చేందుకు కేవలం 27 బంతులను మాత్రమే తీసుకుంది.

బుమ్రాకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌

బుమ్రాకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌

ఆసీస్‌ తమ ఓవర్‌నైట్‌ స్కోరుకు మూడు పరుగులు మాత్రమే జత చేసింది. ఫలితంగా తమ రెం డో ఇన్నింగ్స్‌లో 89.3 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో టీమిండియా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. బాక్సింగ్ డే టెస్టులో 9 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రాకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దక్కింది.

అభిమానికి ప్యాడ్స్ గిప్ట్‌గా ఇచ్చిన కోహ్లీ

టెస్టు ఫార్మాట్‌లో టీమిండియాకిది 150వ విజయం కావడం విశేషం. కాగా, మ్యాచ్ గెలిచిన ఆనందంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులను ఉత్సాహాపరిచాడు. ఈ క్రమంలో గ్యాలరీలో ఉన్న ఓ చిన్నారి అభిమాని వద్దకు వెళ్లి తన ప్యాడ్లను గిప్ట్‌గా అతడికి అందజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

స్టేడియం మొత్తం కలియదిరుగుతూ

బాక్సింగ్ డే టెస్టులో విజయం సాధించిన వెంటనే భారత జట్టు క్రికెటర్లు అంతా వికెట్లను చేతబట్టి స్టేడియం మొత్తం కలియదిరుగుతూ అభిమానులను ఉత్సాహపరిచారు. కోహ్లీ అయితే పెద్దగా చప్పట్లు చరుస్తూ అభిమానులను ఉత్తేజపరిచాడు. పెవిలియన్‌కు వెళుతూ అభిమానులకు ఆటోగ్రాఫ్‌ సైతం ఇచ్చారు.

డ్రెస్సింగ్ రూమ్‌లో తమదైన శైలిలో సంబరాలు

మ్యాచ్ అనంతరం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో తమదైన శైలిలో సంబరాలు కూడా చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ఇదిలా ఉంటే, ఈ సిరిస్‌లో చివరిదైన ఆఖరి టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది.

Story first published: Monday, December 31, 2018, 15:54 [IST]
Other articles published on Dec 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X