న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షమీ బౌన్సర్‌కి కోహ్లీ డకౌట్: సోషల్ మీడియాలో వీడియో వైరల్

WATCH: Virat Kohli beautifully ducks Mohammed Shamis bouncer, toils hard in nets

హైదరాబాద్: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా మరో కఠిన సవాల్‌కు సిద్దమైంది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా గురువారం నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. అడిలైడ్ టెస్టు కోసం ఇప్పటికే అక్కడికి చేరుకున్న టీమిండియా.. రెండు రోజుల నుంచి నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.

<strong>ఇండియా vs ఆస్ట్రేలియా: ఆసీస్ జట్టులో బుల్లి క్రికెటర్, జెర్సీ వేసుకుని ప్రాక్టీస్</strong>ఇండియా vs ఆస్ట్రేలియా: ఆసీస్ జట్టులో బుల్లి క్రికెటర్, జెర్సీ వేసుకుని ప్రాక్టీస్

ఆస్ట్రేలియా‌ గడ్డపై 2014-15లో జరిగిన టెస్టు సిరీస్‌లో నాలుగు సెంచరీలు సాధించడంతో పాటు 692 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ గురువారం నుంచి జరగబోయే సిరిస్‌లో సైతం సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. దీంతో కోహ్లీని నిలువరించాలని ఆసీస్ ఫాస్ట్ బౌలర్లు వ్యూహాలు రచిస్తుండగా వాటిని ఛేదించాలని కోహ్లీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

రెండు రోజుల నుంచి నెట్స్‌లో విరాట్ కోహ్లీ ప్రాక్టీస్

రెండు రోజుల నుంచి నెట్స్‌లో విరాట్ కోహ్లీ ప్రాక్టీస్

ఇందులో భాగంగా రెండు రోజుల నుంచి నెట్స్‌లో విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ముఖ్యంగా భారత్ ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఎక్కువగా బౌన్సర్లని ఆడటంపై దృష్టి పెట్టాడు. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పర్యవేక్షణలో బౌన్సర్లని విడిచిపెట్టడం, ఆఫ్ స్టంప్‌కి అవల పడే బంతుల్ని ఆడకుండా నియంత్రించుకోవడాన్ని ప్రాక్టీస్ చేశాడు.

ఫుల్ లెంగ్త్ బంతుల్ని ఆడటంలో ఇబ్బంది పడిన కోహ్లీ

ఇంగ్లాండ్ పర్యటనలో ఫుల్ లెంగ్త్ బంతుల్ని ఆడటంలో కాస్త ఇబ్బందిపడినట్లు కనిపించిన కోహ్లీకి ఆఫ్ స్టంప్‌కి వెలుపల పడిన బంతుల్ని వెంటాడుతూ స్లిప్‌లో దొరికిపోవడం బలహీనతగా మారింది. ఈ నేపథ్యంలో తన బలహీనతపై దృష్టి సారించి వాటిని అధిగమించే దిశగా నెట్స్‌లో కెప్టెన్ కోహ్లీ తీవ్రంగా శ్రమించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అరుదైన రికార్డ్స్‌కి చేరువలో కోహ్లీ

అరుదైన రికార్డ్స్‌కి చేరువలో కోహ్లీ

కాగా, ఈసారి ఆస్ట్రేలియా గడ్డపై అరుదైన రికార్డ్స్‌కి చేరువలో కోహ్లీ ఉన్నాడు. గురువారం నుంచి అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుండగా.. అందరి కళ్లూ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి. టెస్టు సిరిస్‌కు ముందు సిడ్నీ వేదికగా క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీలతో చెలరేగాడు.

8 టెస్టులాడి 992 పరుగులు

8 టెస్టులాడి 992 పరుగులు

గురువారం నుంచి ఆరంభమయ్యే టెస్టు సిరిస్‌లో సైతం కోహ్లీ మరోసారి చెలరేగుతాడని మాజీ క్రికెటర్లు జోస్యం చెప్తున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకోనున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై 2012, 2014-15లో పర్యటించిన కోహ్లీ ఇప్పటి వరకు 8 టెస్టులాడి 992 పరుగులతో కొనసాగుతున్నాడు.

కోహ్లీ మరో 8 పరుగులు సాధిస్తే

కోహ్లీ మరో 8 పరుగులు సాధిస్తే

కోహ్లీ మరో 8 పరుగులు సాధిస్తే ఆస్ట్రేలియా గడ్డపై 1,000 పరుగుల మైలురాయిని అందుకున్న నాలుగో భారత్ క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించనున్నాడు. ఇప్పటివరకు ఈ జాబితాలో వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్‌లు మాత్రమే ఈ ఘనత అందుకున్నారు.

కెప్టెన్‌గా మరో రికార్డుకి 13 పరుగుల దూరంలో

కెప్టెన్‌గా మరో రికార్డుకి 13 పరుగుల దూరంలో

దీంతో పాటు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా మరో రికార్డుకి 13 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ నాలుగేళ్లలో భారత్ వెలుపల టెస్టుల్లో 1,987 పరుగులు చేసిన కోహ్లీ ఆస్ట్రేలియాపై గురువారం నుంచి జరగనున్న సిరీస్‌లో మరో 13 పరుగులు చేస్తే విదేశాల్లో 2,000 పరుగులు చేసిన తొలి భారత్ కెప్టెన్‌గా చరిత్ర సృష్టించనున్నాడు.

Story first published: Tuesday, December 4, 2018, 18:29 [IST]
Other articles published on Dec 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X