న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని కోసం బారికేడ్లు దూకి మైదానంలోకి: త్రివర్ణ పతాకాన్ని పట్టుకున్నాడు (వీడియో)

India vs New Zealand : Adventure of Dhoni's Fan In 3rd T20 | Oneindia Telugu
WATCH VIDEO - Lightning Quick Dhoni shows his love for Indian Flag

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కోసం అభిమానులు స్టేడియాల్లో బారికేడ్లు దూకి మైదానంలోకి వెళ్లిపోవడం కొత్తేమీ కాదు. ఇండియాలో ఇలాంటి సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. తాజాగా న్యూజిలాండ్‌తో ఆదివారం ముగిసిన మూడో టీ20లో కూడా ఓ అభిమాని ఇదే పని చేశాడు. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చేతిలో త్రివర్ణ పతాకంతో ఓ అభిమాని భద్రత సిబ్బందిని దాటుకుని ధోనీ వైపు పరుగెత్తుకొచ్చాడు.

ధోనికి పాదాభివందనం

ధోనికి పాదాభివందనం

బంతిని సహచరుడికి అందించి వెనుకాలకు తిరిగే సమయంలో అభిమాని ఠక్కున తన చేతిలో ఉన్న పతాకాన్ని కిందపడేస్తూ వంగి ధోనికి పాదాభివందనం చేశాడు. అయితే అతను కిందికి వంగే క్రమంలో చేతిలో ఉన్న భారత జాతీయ జెండా కింద పడబోతుంటే.. ధోనీ మెరుపు వేగంతో స్పందిస్తూ కిందపడుతున్న పతాకాన్ని చేతికి తీసుకోని సెక్యూరిటీ సిబ్బందికి అందజేశాడు.

అభిమానిని క్షేమంగా

అభిమానిని క్షేమంగా

ఆ వెంటనే అభిమానిని క్షేమంగా బయటకు పంపించేశాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే, మూడో టీ20లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దాంతో న్యూజిలాండ్‌లో తొలిసారి టీ20 సిరీస్‌ సాధించాలనుకున్న భారత్‌ ఆశలు తీరలేదు.

2-1తో సిరిస్ న్యూజిలాండ్ కైవసం

మూడు టీ20ల సిరిస్‌ను న్యూజిలాండ్ 2-1తో కైవసం చేసుకుంది. టీ20 క్రికెట్లో న్యూజిలాండ్‌ చేతిలో భారత్‌కు ఇది ఎనిమిదో ఓటమి. మరే జట్టు చేతిలోనూ టీమ్‌ ఇండియా ఇన్నిసార్లు ఓడలేదు. అంతేకాదు దాదాపు రెండేళ్ల కాలంలో ద్వైపాక్షిక సిరీస్‌లో ఓడిపోవడం భారత్‌కు ఇదే తొలిసారి. గత పది సిరీస్‌ల్లో భారత్‌ ఓడిపోలేదు.

ఎక్కువ పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా పాండ్యా

అందులో తొమ్మిది గెలిచి, ఒకటి డ్రా చేసుకుంది. ఈ సిరిస్‌లో పాండ్యా అత్యధికంగా 131 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులిచ్చిన భారత బౌలర్‌గా నిలిచాడు.

Story first published: Monday, February 11, 2019, 12:00 [IST]
Other articles published on Feb 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X