న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ పట్ల అంపైర్ అలీందార్ నిబద్ధత: వీడియో వైరల్, ప్రశంసల వర్షం

Watch: True gentleman of cricket, Aleem Dar wins hearts with his professionalism

హైదరాబాద్: పాకిస్థాన్‌కి చెందిన అంపైర్ అలీందార్ తన వృత్తి పట్ల మరోసారి నిబద్ధతను చాటుకుని సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా కొలంబో వేదికగా శ్రీలంక-ఇంగ్లాండ్ జట్ల మ్యాచ్ ఐదో వన్డే జరిగిన సంగతి తెలిసిందే.

<strong>షమీపై వేటు: బీసీసీఐ నిర్ణయంపై ట్విట్టర్‌లో నెటిజన్ల మండిపాటు</strong>షమీపై వేటు: బీసీసీఐ నిర్ణయంపై ట్విట్టర్‌లో నెటిజన్ల మండిపాటు

ఈ సిరిస్‌లో ఆతిథ్య శ్రీలంక జట్టు గెలిచిన ఏకైక వన్డే ఇదే కావడం విశేషం. అయితే, ఈ మ్యాచ్ మధ్యలో వర్షం రావడంతో ఆటగాళ్లందరూ డ్రస్సింగ్‌ రూమ్‌కి వెళ్లిపోయినా.. తన బాధ్యత నిర్వర్తించిన తర్వాతే అలీందార్ మైదానం నుంచి కదిలి నిబద్ధతని చాటుకున్నాడు.

50 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 366 పరుగులు

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 366 పరుగులు ఛేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 26.1 ఓవర్లు ముగిసే సమయానికి 132/9 పరుగులతో నిలిచింది. ఈ సమయంలో మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారింది.

వర్షం రావడంతో మైదానాన్ని వీడిన ఇరు జట్ల ఆటగాళ్లు

వర్షం రావడంతో ఇరుజట్ల క్రికెటర్లు మైదానాన్ని వీడారు. అయితే, అంపైర్ అలీందార్ మాత్రం మైదానంలోనే ఉండిపోయాడు. దీనికి కారణం వర్షం మరికొద్ది క్షణాల్లో వస్తుందనగా అలీందార్ ఇచ్చిన ఔట్‌ (ఎల్బీ)ని ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఫ్లంకెట్ సవాల్ చేస్తూ డీఆర్ఎస్‌కి వెళ్లాడు.

ప్లంకెట్ డీఆర్‌ఎస్ అడగడం...

ప్లంకెట్ డీఆర్‌ఎస్ అడగడం... అదే సమయంలో థర్డ్ అంపైర్ టీవీ రిప్లై చూస్తుండగా వర్షం మొదలైంది. దీంతో ఫీల్డ్ అంపైర్ బాధ్యత నిర్వర్తించేందుకు మైదానంలోనే ఉన్న అలీందార్.. రిప్లైలో బంతి వికెట్లను తాకేలా కనిపించడంతో.. ఔట్ నిర్ణయం ప్రకటించిన తర్వాతే మైదానం నుంచి బయటకు వెళ్లాడు.

ఔట్ అని వేలెత్తి అలానే.. బౌండరీ లైన్ వరకు

వర్షం కారణంగా.. స్కోరర్‌కి తన నిర్ణయం కనబడదేమో? అని అలీందార్ ఔట్ అని వేలెత్తి అలానే.. బౌండరీ లైన్ వరకూ పరుగెత్తుకుంటూ వెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియాని చూసిన అభిమానులు అలీందార్ నిబద్ధతపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా వర్షం అడ్డంకిగా మారిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం శ్రీలంక 219 పరుగుల తేడాతో గెలిచినట్లు అంఫైర్లు ప్రకటించారు.

Story first published: Friday, October 26, 2018, 15:22 [IST]
Other articles published on Oct 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X