న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒకసారి తప్పించుకున్నాడు: అయ్యర్ సూపర్ త్రోకి యాదవ్ రనౌట్ (వీడియో)

IPL 2019 : Shreyas Iyer Pulls Off A Mind-Boggling Run-Out | Oneindia Telugu
 WATCH – Shreyas Iyer Pulls Off A Mind-boggling Run-out

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. టోర్నీలో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ రెండు సార్లు గురి తప్పకుండా బంతిని నేరుగా వికెట్లపైకి విసిరాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ రెండు సందర్భాల్లోనూ ముంబై బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌ని ఔట్ చేసేందుకే శ్రేయాస్ ప్రయత్నించగా తొలిసారి తప్పించుకున్న అతడు రెండోసారి మాత్రం రనౌటయ్యాడు. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ (78 నాటౌట్: 27 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సులు) హాఫ్ సెంచరీ సాధించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.

214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి

214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి

అనంతరం 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్‌గా ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ (14) నాలుగో ఓవర్‌లోనే పెవిలియన్ చేరాడు. దీంతో మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (2) వికెట్ కాపాడుకుంటూ సింగిల్స్‌ కోసమే ఎక్కువగా ప్రయత్నించాడు.

ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో

ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో

ఈ క్రమంలో ఢిల్లీ పేసర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో బంతిని మిడాన్ దిశగా ఆడి సింగిల్ కోసం పరుగెత్తగా అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయాస్ బంతిని అందుకుని నేరుగా వికెట్లపైకి విసిరాడు. అయితే, క్షణాల వ్యవధిలో సూర్యకుమార్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని క్రీజులోకి రావడంతో రనౌట్ నుంచి తప్పించుకున్నాడు.

నిరాశగా పెవిలియన్‌‌కు చేరిన సూర్యకుమార్

ఆ తర్వాతి ఓవర్ వేసిన ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో మిడాఫ్ దిశగా బంతిని పుష్ చేసి సింగిల్‌ కోసం పరుగెత్తాడు. ఈసారి శ్రేయాస్ అతనికి ఆ అవకాశం ఇవ్వలేదు. వేగంగా బంతిని అందుకుని వికెట్లపైకి విసిరేశాడు. దీంతో క్రీజుకి చాలా దూరంలో ఉండిపోయిన సూర్యకుమార్ నిరాశగా పెవిలియన్‌‌కు చేరాడు.

37 పరుగుల తేడాతో ముంబై ఓటమి

37 పరుగుల తేడాతో ముంబై ఓటమి

ఆ తర్వాత క్రీజులోకి వెటరన్‌ ఆటగాళ్లు యువరాజ్‌, పొలార్డులు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ మ్యాచ్‌లో యువరాజ్‌(53)మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. కీలక సమయంలో ఇద్దరితో పాటు హార్దిక్ పాండ్య (0) కూడా ఔటవడంతో మ్యాచ్‌పై ముంబయి పట్టుజారింది. దీంతో 19.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 176 పరుగుల చేసి 37 పరుగుల తేడాతో ఓడింది.

Story first published: Monday, March 25, 2019, 18:57 [IST]
Other articles published on Mar 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X