మెల్‌బోర్న్ బీచ్‌లో భార్య కోసం బౌలర్‌గా మారిన ధావన్ (వీడియో)

Posted By:
Watch: Shikhar Dhawan plays beach cricket with his wife and kids

హైదరాబాద్: సోషల్ మీడియాలో నిత్యం అభిమానులకు టచ్‌లో ఉండే క్రికెటర్లలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఒకడు. కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించే శిఖర్ ధావన్ వారికి సంబంధించిన ఏ చిన్న విషయాన్ని అయినా అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటాడు.

తాజాగా తన కుటుంబంతో కలిసి మెల్‌బోర్న్ బీచ్‌లో క్రికెట్‌ ఆడుతోన్న ఓ వీడియోని అభిమానులతో పంచుకున్నాడు. 'క్రికెట్ మైదానంలోనే నేను బ్యాట్స్‌మెన్‌ని. కానీ మైదానం వెలుపల నేను బౌలర్‌గా మారిపోయాను. భార్య స్ట్రైకింగ్ తీసుకుంటే ఏ భర్తయినా ఇంతకంటే ఏం చేయగలడు. కుటుంబంతో గడిపే క్షణాలను ఎప్పుడూ ప్రేమిస్తానంటూ' అని ధావన్ పేర్కొన్నాడు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోని చూసిన అభిమానులు 'ధావన్ బౌలింగ్ చేస్తుండగా భార్య బ్యాటింగ్ చేయడం వీడియోలో చూడవచ్చు. వీరి పిల్లలు ఫీల్డర్లుగా మారిపోయి తండ్రి ధావన్‌కు సాయం చేస్తున్నారు' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

వరుస సిరీస్‌ల కారణంగా శిఖర్ ధావన్ తన కుటుంబంతో గడిపేందుకు సమయం దొరకలేదు. నిదాహాస్ ట్రోఫీ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాలో ఉన్న తన భార్య, పిల్లలతో సరదాగా గడిపేందుకు అక్కడికి వెళ్లాడు. కాగా, త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ధావన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

దీంతో వచ్చే వారం తిరిగి ఇండియాకు రానున్నాడు. తొలి మ్యాచ్‌లో భాగంగా డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 7న ముంబైలోని వాంఖడె మైదానంలో జరగనుంది. 'వారం రోజులు కుటుంబంతో సంతోషంగా గడపాలి' అంటూ ధావన్ ఇటీవల ఓ వీడియో పోస్ట్ చేయగా వైరల్ అయింది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Saturday, March 31, 2018, 10:50 [IST]
Other articles published on Mar 31, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి