న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆవేశంతో అంఫైర్‌తో ఊగిపోయాడు: ఆ తర్వాత ఏం జరిగిందంటే!

గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా బంగ్లాదేశ్ జాతీయ జట్టు ఆటగాడు బంగ్లాదేశ్‌ ప్రిమియర్‌ లీగ్‌లో అంపైర్‌ పట్ల దురుసుగా ప్రవర్తించడంతో మ

By Nageshwara Rao
WATCH: Shakib Al Hasan loses cool in Bangladesh Premier League after umpire turns down his appeal

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా బంగ్లాదేశ్ జాతీయ జట్టు ఆటగాడు బంగ్లాదేశ్‌ ప్రిమియర్‌ లీగ్‌లో అంపైర్‌ పట్ల దురుసుగా ప్రవర్తించడంతో మరోసారి వార్తల్లో నిలిచింది.

టోర్నీలో భాగంగా జరుగుతున్న 21వ మ్యాచ్‌లో ఢాకా డైనమైట్స్‌-కొమిల్లా విక్టోరియన్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ ఆల్‌ హాసన్‌ ఢాకా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 129 పరుగుల విజయ లక్ష్యంతో కొమిల్లా విక్టోరియన్స్‌ ఓపెనర్లు బరిలోకి దిగారు.

ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసేందుకు షకీబ్ ఉల్ హాసన్ బౌలింగ్‌కు వచ్చాడు. ఈ సమయంలో క్రీజులో ఇమ్రూల్‌ కయిస్‌ ఉన్నాడు. ఇమ్రూల్‌ కయిస్‌‌కు బంతి వేసిన షకీబ్‌ వెంటనే ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్‌ చేశాడు. అంపైర్‌ కాదనడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు.

అంతటితో ఆగకుండా అంఫైర్‌ను ఏవో నోటికివచ్చినట్లు తిట్టాడు. ఇదంతా గమనించిన టోర్నీ నిర్వాహకులు లెవల్‌-2 నిబంధనను అతిక్రమించినట్లు షకీబ్‌కు తెలిపి మ్యాచ్‌ ఫీజులో 50శాతం కోత విధించారు. ఇందుకు సంభంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన షకీబ్ వికెట్ తీయకుండా 23 పరుగులు సమర్పించుకున్నాడు. షకీబ్ ప్రవర్తనపై ప్రేక్షకులు సైతం మండిపడ్డారు. మరోవైపు ఇదే మ్యాచ్‌లో ఢాకా బ్యాట్స్‌మెన్‌ పట్ల దురుసుగా ప్రవర్తించిన కొమిల్లా బౌలర్‌ హాసన్‌ అలీపై కూడా మ్యాచ్‌ ఫీజులో కోత విధించారు.

Story first published: Wednesday, November 22, 2017, 15:51 [IST]
Other articles published on Nov 22, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X