న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌లోకి మళ్లీ వస్తావా?: అఫ్రిది చెప్పిన సమాధానం ఇదీ! (వీడియో)

By Nageshwara Rao
Watch: Shahid Afridis Hilarious Answer To Nasser Hussain When Asked About Comeback

హైదరాబాద్: గురువారం లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా వెస్టిండీస్, వరల్డ్‌ ఎలెవన్‌ జట్ల మధ్య టీ20 ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వరల్డ్ ఎలెవన్ జట్టుకు సారథ్యం వహించిన పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిదికు జట్టులోని సహచర ఆటగాళ్లకు 'గార్డ్ ఆఫ్ ఆనర్' ఇచ్చి సత్కరించారు.

స్టేడియాల పునరుద్ధరణ నిధుల కోసం మ్యాచ్

స్టేడియాల పునరుద్ధరణ నిధుల కోసం మ్యాచ్

ఈ మ్యాచ్ ద్వారా వచ్చే నిధులను వెస్టిండీస్‌లోని క్రికెట్ మైదానాల పునరుద్ధరణ పనులకు ఉపయోగించనున్నారు. గతేడాది ఇర్మా తుఫాను వల్ల కరేబియన్ దీవుల్లోని ఐదు క్రికెట్ మైదానాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటిని పునరుద్ధరించేందుకు అవసరమైన నిధులను సేకరించేందుకు ఈ మ్యాచ్‌ని ఐసీసీ అధికారికంగా నిర్వహించింది.

ఈ చారిటీ మ్యాచ్‌‌లో వరల్డ్ ఎలెవన్ జట్టుకు సారథ్యం

వహించిన అఫ్రిదిని మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ జట్టు మాజీ కెప్టెన్, కామెంటేటర్ నాసిర్ హుస్సేన్ ఇంటర్యూ చేశాడు. ఈ సందర్భంగా నాసిర్ హుస్సేన్ ‘క్రికెట్‌లోకి మళ్లీ వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా?' అని ప్రశ్నిస్తూ నవ్వేశాడు. నాసిర్ హుస్సేన్ ప్రశ్నకు స్పందించిన అఫ్రిది తన ఎడమ చేతిని నాసిర్‌పై భుజాలపై వేసి ‘లేదు.. అటువంటి ఆలోచన లేదు. గాయంతో బాధపడుతున్న నా పరిస్థితి ఇది' అని పేర్కొంటూ నవ్వేశాడు.

 గార్డ్ ఆఫ్ ఆనర్ లభించడం మర్చిపోలేని అనుభూతి

గార్డ్ ఆఫ్ ఆనర్ లభించడం మర్చిపోలేని అనుభూతి

తనకు గార్డ్ ఆఫ్ ఆనర్ లభించడాన్ని తానెప్పుడూ మర్చిపోలేనని అఫ్రిది చెప్పాడు. ఈ మ్యాచ్‌లో అఫ్రిది ఓ వికెట్ తీసి 11 పరుగులు చేశాడు. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో విండీస్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది.

వరల్డ్ ఎలెవన్‌పై వెస్టిండిస్ 72 పరుగుల తేడాతో విజయం

వరల్డ్ ఎలెవన్‌పై వెస్టిండిస్ 72 పరుగుల తేడాతో విజయం

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. అనంతరం 200 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వరల్డ్ ఎలెవన్ జట్టు 127 పరుగులకే కుప్పకూలింది. కాగా, అఫ్రిది తన ఫౌండేషన్ నుంచి 20 వేల డాలర్లు విరాళం ఇవ్వగా, మ్యాచ్‌లో ఆడిన ఆటగాళ్లందరూ తమ మ్యాచ్‌ ఫీజును విరాళంగా ఇచ్చేశారు.

Story first published: Friday, June 1, 2018, 17:29 [IST]
Other articles published on Jun 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X