న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తృటిలో రనౌట్ మిస్సయ్యేది: జడేజాపై కోప్పడ్డ కోహ్లీ, అశ్విన్ (వీడియో వైరల్)

India vs west Indies 1st Test 2nd Day : Jadeja's Funny Run Out Gets Comments In Social Media
WATCH: Ravindra Jadeja’s ‘comical’ run out against West Indies faces Virat Kohli’s wrath

హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రవీంద్ర జడేజా చేసిన ఓ రనౌట్‌ కెప్టెన్ కోహ్లీ, బౌలర్ అశ్విన్ కోపానికి కారణమైంది. ఆటలో భాగంగా రెండో రోజైన శుక్రవారం టీమిండియా 649/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి వెస్టిండిస్ జట్టుని బ్యాటింగ్‌కు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ప్రకారం: పృథ్వీ షానే మరో సచిన్ టెండూల్కరా?న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ప్రకారం: పృథ్వీ షానే మరో సచిన్ టెండూల్కరా?

అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండిస్ జట్టు 14 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 39 పరుగులతో కష్టాల్లో పడింది. విండిస్ ఓపెనర్లు బ్రాత్‌వైట్ (2), పోవెల్‌ (1)ని మహ్మద్ షమీ పెవిలియన్‌కు చేర్చగా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షై హోప్ (10)‌ని స్పిన్నర్ అశ్విన్ పెవిలియన్‌కు చేర్చాడు.

జడేజా కవ్వింపు రనౌట్‌తో పెవిలియన్‌కు

ఆ తర్వాత నాలుగో వికెట్‌‌గా పెవిలియన్‌కు చేరిన షిమ్రోన్‌ హెట్‌మయర్‌ (10)‌ని జడేజా కవ్వింపు రనౌట్‌తో పెవిలియన్ బాట పట్టించడం విశేషం. 12వ ఓవర్ వేసిన అశ్విన్ బౌలింగ్‌లో హెట్‌మయర్‌ బంతిని మిడాన్ దిశగా నెట్టి పరుగు కోసం నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఆంబ్రిస్‌ని పిలిచాడు. ఆ సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తోన్న రవీంద్ర జడేజా మెరుపు వేగంతో కదిలి బంతిని అందుకున్నాడు.

వెనక్కి వెళ్లిపోయే ప్రయత్నం చేసిన హెట్‌మయర్

దీంతో మళ్లీ పరుగు వద్దంటూ హెట్‌మయర్ వెనక్కి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. అప్పటికే క్రీజు వదిలిన ఆంబ్రిస్ దాదాపు పిచ్ మధ్యలోకి వచ్చేశాడు. దీంతో.. ఇద్దరూ తడబాటులో తొలుత కీపర్ వైపు పరుగెత్తారు. బ్యాట్స్‌మెన్స్ ఇద్దరూ ఒకే ఎండ్‌వైపు వెళ్లడంతో ఇద్దరి ఎవరో ఒకరు రనౌట్ అయ్యేలా కనిపించింది.

అశ్విన్‌కి బంతిని ఇవ్వకుండా

బంతిని అందుకున్న జడేజా.. బౌలర్ అశ్విన్‌కి బంతిని ఇవ్వకుండా.. నింపాదిగా మిడాన్ నుంచి బంతిని తీసుకుని వస్తుండటాన్ని గమనించిన హెట్‌మయర్‌ వేగంగా నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు పరుగెత్తాడు. అయినా సరే, కంగారుపడని జడేజా

నెమ్మదిగా నడుచుకుంటూ వికెట్ల సమీపానికి చేరుకున్నాడు. ఈ సమయంలో హెట్‌మయర్‌ దాదాపు క్రీజు దగ్గరికి రాగా, ఆఖరి క్షణంలో వికెట్లపైకి గురి చూసి బంతిని విసిరాడు.

జడేజాపై కోప్పడ్డ కోహ్లీ, అశ్విన్

జడేజా తీరుతో తృటిలో హెట్‌మయర్ రనౌట్ నుంచి తప్పించుకునేవాడే. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ, అశ్విన్... జడేజాపై కోపాన్ని ప్రదర్శించారు. ఆ తర్వాత రవీంద్ర జడేజా నింపాదిగా రనౌట్ చేసిన తీరు రిప్లైలో చూసి ముసిముసిగా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Story first published: Friday, October 5, 2018, 17:00 [IST]
Other articles published on Oct 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X